Advertisement
Google Ads BL

హరిహర వీరమల్లు పై అప్ డేట్ వచ్చేసింది


గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ తో బ్రేకిచ్చిన హరి హర వీరమల్లు షూటింగ్ గత ఏడాది అక్టోబర్ లోనే మొదలవుతుంది అన్నా.. అప్పటినుండి ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాక హరి హర వీరమల్లు మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతుంది అంటూ హడావిడి చెయ్యడమే కానీ.. అది జరగలేదు. ఇక నేడు హరి హర వీరమల్లు నుండి పవన్ ఫాన్స్ కి పవన్ కళ్యాణ్ యుద్ధ విన్యాసాలు నేర్చుకున్న ఫొటోస్ తో పాటు అప్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

అది రేపటి నుండి అంటే ఏప్రిల్ 8 నుండి హరి హర వీరమల్లు మళ్ళీ పట్టాలెక్కబోతుంది అంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. చాలా గ్యాప్ తరువాత తిరిగి షూటింగును స్టార్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను క్రిష్ చేపట్టనున్నారని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కత్తిసాము నేర్చుకుంటున్న ఫొటోస్ ని రిలీజ్ చెయ్యడంతో పవన్ ఫాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భీమ్లా నాయక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన పవన్ హరి హర వీరమల్లులో గజ దొంగ గా ఎలాంటి పెరఫార్మెన్స్ చూపిస్తారో అనే ఊహాగానాల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. ఓ కీలక మహారాణి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫెతి నటిస్తుంది. 

Hari Hara Veera Mallu Movie Update:

Hari Hara Veera Mallu Shoot resuming from 8th April
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs