Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టారా


మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ మూవీ ని ఓ బడా మల్టీస్టారర్ లా తెరకెక్కిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ లూసిఫర్ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా తెలుగు నేటివిటీకి దగ్గరగా మలుస్తున్నారు. ఈ సినిమా లో చిరు గాడ్ ఫాదర్ గాను, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ కి బాడీ గార్డ్ గాను, నయనతార చిరు కి సిస్టర్ గాను, సత్యదేవ్ విలన్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో గాడ్ ఫాదర్ కి బాడీ గార్డ్ కి ఓ సాంగ్ సెట్ చేశారట. ముంబైలో సల్మాన్ ఖాన్ - చిరు మధ్యలో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

గాడ్ ఫాదర్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లుగా సమాచారం. దానితో ఈ సినిమా కి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారని, త్వరలోనే ఆ డేట్ పై అఫీషియల్ ప్రకటన మేకర్స్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అది ఆగష్టు లో లాంగ్ వీకెండ్ అయిన ఆగస్ట్ 11న గాడ్ ఫాదర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15 సోమవారం అవ్వడంతో వరుసగా సెలవులు కలిసి వస్తాయని మేకర్స్ భావిస్తున్నారట. మళ్ళీ పెద్ద సినిమాలేవీ ఆ డేట్ ఆక్యుపై చెయ్యకుండా ఆ డేట్ లాక్ చెయ్యాలని చూస్తున్నారట. మరో పక్క అదే డేట్ కి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా బాలీవుడ్ నుండి రిలీజ్ కాబోతుంది. మరి అదే డేట్ కి గాడ్ ఫాదర్ తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ చెయ్యడం పై ఇప్పుడు అందరిలో ఆశక్తి నెలకొంది.

Godfather Release date locked?:

Megastar Godfather Release Date Lock Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs