Advertisement
Google Ads BL

ఆర్ ఆర్ ఆర్ పార్టీలో టాప్ డైరెక్టర్స్


రాజమౌళి దేశం గర్వించదగిన హిట్ ని ట్రిపుల్ ఆర్ తో టాలీవడ్ కి అందించారు. ట్రిపుల్ ఆర్ విడుదలైన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అవడంతో.. ఆర్ ఆర్ ఆర్ టీం చాలా హ్యాపీ గా ఉంది. ఇక నైజాం డిస్ట్రిబ్యూటర్ కం టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నైజాం లో 100 కోట్ల మార్క్ అందుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ టీం కి స్పెషల్ గా పార్టీ ఆరెంజ్ చేసారు. రాజమౌళి తో ఆయన ఫ్యామిలీ, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ తమ భార్యలతో ఈ పార్టీకి హాజరయ్యారు. ఇంకా ఈ పార్టీకి టాలీవుడ్ నుండి ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే. అయితే దిల్ రాజు ఇచ్చిన స్పెషల్ పార్టీలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పాల్గొని ఎంజాయ్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది. 

Advertisement
CJ Advs

దిల్ రాజు పార్టీకి త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరామ్, కొరటాల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు వచ్చిన విషయం రీసెంట్ గా రిలీజ్ అయిన పిక్స్ చూసాకే తెలిసింది. అనిల్ రావిపూడి రాజమౌళి కలిసి నాటు నాటు స్టెప్స్ కి వేసిన డాన్స్ రెండు రోజుల క్రితం పార్టీ రోజునే వైరల్ అయ్యింది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దానయ్యలు ట్రిపుల్ ఆర్ సక్సెస్ కేక్ కట్ చేసారు. త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్ వాళ్ళు పార్టీని ఎంతగా ఎంజాయ్ చేసారో ఆ పిక్స్ చూస్తే తెలుస్తుంది. అల్లు అరవింద్ కూడా హాజరైన ఈ పార్టీలో ఎన్టీఆర్ ని అల్లు అరవింద్ హగ్ చేసుకోవడం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.  

Top Directors at Dil Raju hosted RRR party:

Tollywood Top Directors attend Dil Raju party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs