Advertisement
Google Ads BL

ఈసారి త్రివిక్రమ్ బుక్ అయ్యారు


గత కొన్ని రోజులుగా తెలంగాణాలో ఎండ తాకిడిని తట్టుకోలేక చాలామంది కార్ల అద్దాలకి బ్లాక్ ఫిలిం పెట్టుకుని తిరుగుతుండడంతో తెలంగాణా ట్రాఫిక్ పోలీస్ లు ఆ కార్లని ఆపి ఫైన్ విధించడమే కాకుండా ఆ కార్ల అద్దాలకి ఉన్న బ్లాక్ ఫిలిం ని తొలగిపోస్తూ షాకిస్తున్నారు. ఆ క్రమంలో అల్లు అర్జున్ కారు, కళ్యాణ్ రామ్ కారు, రీసెంట్ గా మంచు మనోజ్ కారులని ఆపిన ట్రాఫిక్ పోలీస్ లు వారికి 700 రూపాయల ఫైన్ వెయ్యడమే కాకుండా ఆ కార్లకి ఉన్న బ్లాక్ ఫిలిమ్స్ ని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. 

Advertisement
CJ Advs

గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లి హీల్స్ ప్రాంతాల్లో రీసెంట్ గా వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన అధికారులు బ్లాక్ ఫిల్మ్ ఉండే కార్లపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ కూడా పోలీస్ లకి దొరికిపోయారు. జూబ్లిహీల్స్‌లో అటుగా వెళుతున్న త్రివిక్రమ్ కారును ట్రాఫిక్ పోలీస్ లు ఆపారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించడమే కాకుండా ఆయన కారుకు 700 రూపాయల జరిమానా కూడా విధించారు. 

Hyderabad police fine Trivikram for violating rules:

Hyderabad cops stop Trivikram for breaking rules
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs