Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ కి లైన్ వేస్తుంది


అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. పుష్ప సినిమాతో సోలో పాన్ ఇండియా హిట్ కొట్టి పుష్ప 2 కోసం ప్రిపేర్ అవుతున్న అల్లు అర్జున్ అంటే ఎప్పటికి ఇష్టం అంటూ ఓ ప్లాప్ హీరోయిన్ అల్లు అర్జున్ ని లైన్ పెట్టేందుకు ఎత్తులు వేస్తుంది. అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మూవీస్ లేవు. గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సక్సెస్ కి దూరమవడంతో ఆమెని దర్శకనిర్మాతలు దూరం పెట్టేసారు. ఒకప్పుడు భారీగా డిమాండ్ చేసిన రకుల్ ఇప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకుని మరీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అలాగే మూవీస్ అనే పట్టుదలకు పోకుండా వెబ్ సీరీస్ లో నటించేయ్యడానికి సిద్దపడిపోయింది. 

Advertisement
CJ Advs

బాలీవుడ్ లో రకుల్ చేతిలో సినిమాలు ఉన్నా అక్కడా అమ్మడుకి సక్సెస్ రావడం లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్ ని షేర్ చేస్తూ అవకాశాల కోసం అర్రులు చాస్తున్న రకుల్ ప్రీత్ తాజాగా ఇన్స్టా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. ఆ చిట్ చాట్ లో ఓ అభిమాని.. టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని ప్రశ్నించగా.. రకుల్ ప్రీత్ దానికి బదులిస్తూ.. ఎప్పుడూ అల్లు అర్జున్ అని చెప్పింది. నేను అభిమానించేది అల్లు అర్జున్ నే అని చెప్పింది. మరి ప్రస్తుతం అల్లు అర్జున్ అర్జున్ అయినా తనకి ఆయన సినిమాలో ఛాన్స్ ఇస్తాడని కలలు కంటుందా? మరోపక్క రామ్ చరణ్, ఎన్టీఆర్ తోనూ రకుల్ కి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. కానీ వాళ్ళ పేర్లు చెప్పకుండా రకుల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పడం నిజంగా విశేషమే. 

Rakul Preet Singh reveals her favourite Telugu actor:

Rakul preet singh chit chat with fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs