Advertisement
Google Ads BL

ప్రభాస్ నెక్స్ట్ ముహూర్తం ఫిక్స్


రాధే శ్యామ్ మూవీ తర్వాత ప్రభాస్ కొద్దిరోజులపాటు స్పెయిన్ వెళ్లి వచ్చారు. తర్వాత ప్రాజెక్ట్ కె, సలార్ షూటింగ్స్ కోసం సమాయత్తమవడానికన్నా ముందే ప్రభాస్ తన తదుపరి మూవీ కి కొబ్బరికాయ కొట్టెయ్యబోతున్నారు. అది కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చెయ్యబోతున్న హర్రర్ అండ్ కామెడీ చిత్రాన్ని ప్రభాస్ ఈ నెల అంటే ఏప్రిల్ 10 న పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు. మారుతి ఇప్పటికే ప్రభాస్ తో చెయ్యబోయే మూవీ స్క్రిప్ట్ ని లాక్ చేసారని.. అందుకే సినిమాని పూజా తో మొదలు పెట్టి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుకుంటున్నారని.. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా తక్కువ డేట్స్ కేటాయిస్తే సరిపోతుంది అని టాక్. 

Advertisement
CJ Advs

ఇంకా ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఒకే సెట్ లో జరుగుతుంది అని, ఆ సెట్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావొచ్చింది అని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నారని.. అందులో తమిళ్ గ్లామర్ హీరోయిన్ మాళవిక మోహన్ ఒకరు కాగా, మరొకరు శ్రీ లీలా, ఇంకొకరు రాశి ఖన్నా అంటూ ప్రచారం జరుగుటఁది. ఫైనల్ గా ఏ ముగ్గురు ప్రభాస్ కి జోడిగా నటిస్తారో తెలియాల్సి ఉంది. 

Is the Prabhas-Maruti film going to be launched on April 10th?:

Prabhas and Maruthi film all set for grand launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs