Advertisement
Google Ads BL

మలైకా అరోరాకి కారు ప్రమాదం


బాలీవుడ్ లో 40 ఏళ్ళు దాటినా వన్నె తరగని అందంతో హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్న మలైకా అరోరా ప్రెజెంట్ హీరోయిన్ గా నటించకపోయినా ఫ్యాషన్ షోస్ లో పార్టిసిపేట్ చెయ్యడం అలాగే డాన్స్ షో లకి జేడ్జ్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటుంది. ఇక యోగ, జిమ్ వర్కౌట్స్ తో బాడీ ని ఫిట్ గా ఉంచుకునే మలైకా.. అర్జున్ కపూర్ లవ్ విషయంలో మాత్రం మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే మలైకా అరోరా తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం మధ్యాహ్నం మలైకా అరోరా ఓ ఫ్యాషన్ ఈవెంట్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా.. ముంబై - పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఓ టోల్ గేట్ దగ్గర మలైకా కారుకి మరో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకుంటూ వచ్చి గట్టిగా తగలడంతో మలైకా అరోరాకి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

మలైకా కి ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆమె బాడీ గార్డ్, అలాగే కారు డ్రైవర్ ఉన్నారని, హైవేపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని కార్లు దెబ్బతిన్నాయని, ప్రమాదం తర్వాత మిగతా వాహనాలు వెళ్లిపోగా, గాయపడ్డ మలైకాను వెంటనే ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు ఆమె సిబ్బంది. కారు ప్రమాదంలో మలైకా నుదిటిపై కంటి దగ్గర చిన్న గాయాలయ్యాయని, తర్వాత ఆమెకు సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించగా పెద్ద ప్రమాదం ఏం లేదని, మలైకా కోలుకుంటే ఈ రోజు ఆదివారమే డిశ్ఛార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా అపోలో డాక్టర్స్ తెలిపారు. 

Malaika Arora injured in car accident:

<a class="WlydOe" href="https://www.ndtv.com/india-news/actor-malaika-arora-injured-in-car-accident-admitted-to-hospital-2859155"></a> <div class="vJOb1e aIfcHf"> <div class="iRPxbe"> <div class="mCBkyc tNxQIb ynAwRc nDgy9d">Malaika Arora to be discharged from hospital on Sunday</div> </div> </div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs