పవన్ కళ్యాణ్ కి వరస కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. వకీల్ సాబ్ చెయ్యడానికి ఏడాదిన్నర, భీమ్లా నాయక్ ఫినిష్ చెయ్యడానికి ఏడాదికి పైగా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇపుడు హరిహర వీరమల్లు, సురేందర్ రెడ్డి మూవీ, అలాగే భవదీయుడు భగత్ సింగ్ మూవీ తో పాటుగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి తేజ్ తో మరో రీమేక్ అంటున్నారు. అసలు అటు రాజకీయాలతో అప్పడప్పుడు బిజీ గా మారడంతో షూటింగ్స్ లేట్ అవుతున్నాయి. 2024 లో ఎన్నికలు అంటే ఖచ్చితంగా రెండేళ్ల టైం మాత్రమే ఉంది.
ఈలోపు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు షూటింగ్స్ కంప్లీట్ అవుతాయా? మధ్యలో పవన్ ఎన్నికల ప్రచారానికి వెళితే మళ్లీ షూటింగ్స్ కి గ్యాప్ వచ్చేస్తుంది. ఈలోపు నిర్మాతలు లాస్ అవుతారు. ఏది ఏమైనా పవన్ తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు లాస్ వచ్చినా ఆలోచించరు కానీ.. పవన్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతారు. పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాల్లో కూడా ఈమధ్యన ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. రాజకీయాలు- షూటింగ్స్ అంటూ పవన్ కళ్యాణ్ ఈ రెండేళ్లు ఎలా ప్రయాణం చేస్తారో చూడాలి.