Advertisement
Google Ads BL

రణబీర్-అలియా పెళ్లి ఎప్పుడు.. ఎక్కడంటే


బాలీవుడ్ క్యూట్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్ - అలియా భట్ లు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా ఈనెలలోనే అంటున్నారు. 2022 ఏప్రిల్ లో రణబీర్ - అలియా భట్ లు ఓ ఇంటి వారు కాబోతున్నారని, అయితే సెలబ్రిటీస్ వెడ్డింగ్స్ లాగా వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాదట. అంతేకాకుండా అదిరిపోయే హోటల్స్ లోను వీరి పెళ్లి జరగడం లేదట. రణబీర్ కపూర్ ఫ్యామిలీ కి కలిసి వచ్చిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో రణబీర్ - అలియా భాట్ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కపూర్స్ ఫ్యామిలీ సభ్యులందరూ ముంబైలోని ఆర్కే హౌస్‌‌ చాలా సెంటిమెంట్. రణబీర్ కపూర్ తల్లితండ్రుల పెళ్లి కూడా అక్కడే జరగడంతో.. ఇప్పుడు రణబీర్ - అలియా ల పెళ్లి కూడా అక్కడే జరపాలని నిర్ణయించారు.

Advertisement
CJ Advs

అక్కడే ఆర్కే హౌస్ లో రణబీర్ - అలియా భట్ ల పెళ్లిపై అంగరంగ వైభవంగా జరిపించడానికి కపూర్ ఫ్యామిలి నిర్ణయించిందంట. ఈ పెళ్లికి 450 మంది అతిధుల జాబితా కూడా సిద్ధమైంది అని, ఏప్రిల్ సెకండ్ వీక్ లో వీరి పెళ్లి జరగొచ్చంటూ ఓ బాలీవుడ్ మీడియా హౌస్ వరస కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే ఈ పెళ్లి విషయమై అటు కపూర్స్ ఫ్యామిలీ కానీ ఇటు అలియా భట్ ఫ్యామిలీ కానీ స్పందించలేదు. ఆలియా అమ్మమ్మ నరేంద్రనాథ్ రజ్దాన్ హెల్త్ కండిషన్ బాగోలేకపోవడంతో.. వీరి పెళ్లి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా జరిపించాలని చూస్తున్నారట.

Ranbir Kapoor and Alia Bhatt to get married in April 2022:

Alia Bhatt and Ranbir Kapoor finally decide to get married at ancestral RK house in April
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs