Advertisement
Google Ads BL

గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక


ఉగాది పండగ అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన పర్వదినం. అందుకే టాలీవుడ్ మొత్తం ఉగాది పండగని ఫస్ట్ లుక్ పోస్టర్స్, కొత్త సినిమాల ఓపెనింగ్స్, అలాగే టీజర్స్ రిలీజ్ లతో సోషల్ మీడియాని నింపేస్తాయి. అయితే సక్సెస్ ఫుల్ హీరోయిన్, లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న ఈ ఉగాది రోజున ఆమె అభిమానులకి తీపి కబురు చెప్పింది. The good day comes with good news ❤️ అంటూ తాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ యానిమల్ మూవీలో నటించబోతున్నట్టుగా కంఫర్మ్ చేసింది.

Advertisement
CJ Advs

నిన్నటివరకు రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా మూవీలో రష్మిక ఐటెం సాంగ్ చేయబోతుంది అన్నారు. మరోపక్క పరిణీతి చోప్రా ప్లేస్ లోకి రష్మిక రాబోతుంది అన్నారు. ఫైనల్ గా నేడు తాను ఆ సినిమాలో నటించబోతున్నట్టుగా రష్మిక ప్రకటించింది. అది కూడా గ్లామర్ పిక్ - ట్రెడిషనల్ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఈ తీపి కబురుని తన ఫాన్స్ తో పంచుకుంది. మరి రష్మిక ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. పుష్ప సినిమాతో రష్మిక అదిరిపోయే హిట్ కొట్టింది. అలాగే బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటిస్తుంది. నిజంగా యానిమల్ లో అవకాశం రావడం మాత్రం రశ్మికకి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

Rashmika says good news:

Rashmika Mandanna joins Ranbir Kapoor Animal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs