బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలై ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. హౌస్ లో కెప్టెన్సీ టాస్క్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్యన అగ్గి రాజుకుంటుంది. అది నామినేషన్స్ అప్పుడు మరింత హీటెక్కిస్తోంది. నామినేషన్స్ విషయంలో తమ మనసులో ఉన్న అక్కసుని కంటెస్టెంట్స్ కక్కేస్తున్నారు. ఇప్పటికి నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ ని వీడగా.. మొదటి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ గరం గరంగా సాగింది. అందులో అఖిల్ ఐదో వారానికి కెప్టెన్ గా నిలిచాడు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా, స్రవంతి, తేజస్వీ, అనిల్ రాథోడ్‌లు లో బిందు మాధవి ఓటింగ్ పరంగా మొదటి స్థానంలో ఉండగా.. ఆ నెక్స్ట్ ప్లేస్ లో యాంకర్ శివ ఉన్నాడు. ఆ తర్వాత అరియనా, ఆ తర్వాత స్థానాల్లో అనిల్ రాథోడ్, మిత్ర శర్మ అటు ఇటుగా ఓటింగ్స్ లో ఒకే పొజిషన్ లో ఉన్నారు. ఇక చివరిగా తేజస్వి, స్రవంతిలు ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉండగా.. తక్కువ ఓట్స్ తో తేజస్వి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ వారం ఎలిమినేషన్స్ మాత్రం ఆసక్తికరంగా ఉండబోతున్నాయనేది మాత్రం తెలుస్తుంది. చూద్దాం ఈ వారం ఎవరు బయటికి వెళతారో అనేది.