Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ మనసులో మాట


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా బాలీవుడ్ మీడియా తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ విషయాలతో పాటుగా ఎన్టీఆర్ తన మనసులోని మాటలని మీడియా ముందు బయట పెట్టేస్తున్నారు. తాను యాక్టింగ్ మొదలు పెట్టి 20 ఇయర్స్ అయ్యింది అని, 17 ఇయర్స్ అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అని, ఒకప్పుడు హిట్ వచ్చినా, ప్లాప్ వచ్చినా తీవ్రంగా ఆలోచించే వాడిని కానీ, ఇప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇలా దేన్ని అయినా సులభంగా తీసుకోవడం  అలవాటు చేసుకున్నాను అని, విజయం వచ్చినా ఆ క్షణం వరకే, ప్లాప్ వచ్చినా ఆ క్షణం వరకే.. ప్రతి ఫెయిల్యూర్ మనకి ఏదో ఒకటి నేర్పుతుంది.. తర్వాత దానిలో నుండి బయటపడి నా వర్క్ లో నేను బిజీ అవుతాను అని చెప్పారు ఎన్టీఆర్. 

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ తన తాతయ్య నుండి ఎన్నో నేర్చుకున్నాను అని, సమాజం మనకు ఎంతో ఇస్తుంది. మనము ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇచ్చెయ్యాలి. అనే విషయాన్ని ఆయన నుండే నేర్చుకున్నాను. అసలు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా.. ఎంతోమంది నన్ను ప్రాణంగా పేమిస్తున్నారు. నేను హ్యాపీగా ఉంటే వారు ఎన్నో రెట్ల ఆనందంగా ఉంటారు. నేను బాధలో ఉంటే వారు కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను ఏం ఇవ్వగలను. మంచి సినిమాలు చేసి వాళ్ళు గర్వపడేలా తప్ప అంటూ ఎన్టీఆర్ తన మనసులోని మాటలను బయట పెట్టారు.

ఇంకా నేను సెట్ లో ఉన్నంత వరకే ఎన్టీఆర్ ని. అక్కడే ఎన్టీఆర్ ని స్టార్ ని అనుకుంటాను. ఒన్స్ ఒకసారి సెట్ నుండి ఇంటి గేటు లోపలి వచ్చాక నేనూ సాధారణ మనిషినే అని భావిస్తాను. ఇంటి గేటు బయట కాలు పెట్టాక ఎన్టీఆర్ లా ఫీలవుతాను అని చెప్పిన ఎన్టీఆర్ పాలిటిక్స్ పై కూడా మట్లాడారు. పొలిటికల్ ఎంట్రీ గురించి అడుగుతున్నారు. నేను ఫ్యూచర్ ని నమ్మని, కేవలం ఈ క్షణాన్ని మాత్రమే ఆస్వాదిస్తాను. ప్రస్తుతం నటుడిగా ఈ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ చాలా సంతృప్తిగా ఉన్నాను అంటూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

NTR on Politics :

NTR on his political entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs