పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ భీబత్సం ముగిసినది. ఆ సినిమా థియేటర్స్ లో సునామి కలెక్షన్స్ తో దూసుకుపోగా.. రీసెంట్ గానే హాట్ స్టార్, ఆహా ఓటిటి నుండి అందరి ఇళ్లల్లో సందడి చేసింది. ఇక పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ హరి హర వీరమల్లు పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అయితే గత ఏడాది ఇదే టైం లో సెకండ్ వేవ్ లాక్ డౌన్ తో ఆగిన ఆ సినిమా షూటింగ్ మళ్ళీ ఇంతవరకు మొదలు కాలేదు. రీసెంట్ గానే హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది అన్నప్పటికీ.. ఇంకా సెట్స్ నిర్మాణంలో ఉండడం, ఇతర కారణాలతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఉగాది వెళ్లిన తర్వాత అంటే ఏప్రిల్ 6 నుండి హరి హర వీరమల్లు ఫ్రెష్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారని.. దానికి క్రిష్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని, పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్ 6 కల్లా ఆ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అయితే అటు రాజకీయాల్లో కాస్త యాక్టీవ్ గా మారిన పవన్ కళ్యాణ్ కొత్తగా ఏపీలో పెరిగిన కరెంట్ చార్జీలు తగ్గించేవరకు జగన్ ప్రభుత్వంపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు. మరి అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ తో పవన్ మరోసారి బిజీగా మారబోతున్నారు. హరి హర వీరమల్లు మళ్లీ ఏప్రిల్ 6 నే సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.