సర్కారు బాబు సర్కారు వారి పాటతో మే 12 న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన కళావతి సాంగ్ తో మహేష్ రికార్డ్ వ్యూస్ తో ఫాన్స్ కి పూనకాలు తెప్పించారు. చిన్న పిల్లల దగ్గర నుండి హీరోయిన్స్ వరకు అందరూ కళావతి స్టెప్స్ తో కాలు కదిపి ఆ సాంగ్ కి మరింత హైప్ పెంచేశారు. చాలా హ్యాండ్ సం గా కనిపిస్తున్న మహేష్ ఈ సినిమాలో కాస్త మాసివ్ లుక్ నే మెయింటింగ్ చేసినట్లుగా పెన్నీ సాంగ్ చూస్తే తెలుస్తుంది. అయితే తాజాగా సర్కారు వారి పాటలో ఓ సీన్ సినిమాకే మేజర్ హైలైట్ అంటున్నారు.
సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటుగా కామెడీకి ప్రాధాన్యత ఇచ్చారట పరశురామ్. సినిమాలోని కొని సన్నివేశాలు చాలా స్పెషల్‌గా ఉంటాయని.. ముఖ్యంగా గత నెలలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన రైల్వే స్టేషన్ సెట్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉండనున్నాయట. ఈ రైల్వే స్టేషన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని.. సినిమాలో అసలు ట్విస్ట్ కూడా ఇక్కడే ఉంటుందని, సినిమాలో ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెబుతున్నారు. ఉగాదికి సర్కారు వారి పాట నుండి మహేష్ ఫాన్స్ కి ట్రీట్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం ప్యాచ్ వర్క్స్ లో బిజీగా ఉందని సమాచారం.