బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అఖిల్ సార్థక్ - బిందు మాధవి మధ్యన హోరా హోరి ఫైట్ జరుగుతుంది. అఖిల్ టైటిల్ ఫెవరెట్ గా దిగితే బిందుమాధవి నార్మల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మైండ్ గేమ్, టాస్క్ పెరఫామెన్స్ తో టైటిల్ కి చేరువయ్యేలా కనిపిస్తుంది. దానితో హౌస్ మేట్స్ లో చాలామంది బిందు మాధవిని డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తున్నారు. అందులో నటరాజ్ మాస్టర్ ఒకరు. ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో హోరా హోరీగా తలపడుతున్నారు కంటెస్టెంట్స్. ఈ ఫైట్ లో యాంకర్ శివ ని ఓడించడానికి అఖిల్ ప్రయత్నించగా.. శివ కి బిందు మాధవి సపోర్ట్ చేస్తుంది.
అందులో భాగంగా బిందు మాధవికి - అఖిల్ కి మధ్యన మాటల యుద్ధం జరిగింది. ఫ్రెండ్ లేకుంటే బతకలేవు.. నువ్వు మాత్రమే గేమ్ ఆడు అంటూ బిందు మాధవి అనడంతో అఖిల్ బాగా ఏడ్చేశాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అఖిల్ - బిందు మాధవి విడాకుల కోసం కోర్టుకి వచ్చారు. అందులో ముమైత్ ఖాన్ జేడ్జ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ టాస్క్ లో బిందు కి సపోర్ట్ గా శివ, అఖిల్ కి సపోర్ట్ గా నటరాజ్ మాస్టర్ లు వ్యవహరించారు. ఇక అఖిల్ వైపు కొంతమంది కంటెస్టెంట్స్, బిందు పక్కన మరికొందరు కంటెస్టెంట్స్ ఉండగా.. అఖిల్ వర్గం బిందు మాధవిని టార్గెట్ చేసి నానా మాటలనడంతో బిందు మాధవి కోపంగా మైక్ విసిరేసి టాస్క్ నుండి వెళ్ళిపోయి బెడ్ పై ఒంటరిగా పడుకుని ఏడ్చేసింది.
ఇంతవరకు ఎవరూ ఇలా మైక్ విసరలేదు అంటూ హౌస్ మేట్స్ మట్లాడుకున్నారు. తర్వాత బిందు మాధవి రియలైజ్ అయ్యి మైక్ వేసుకుని టాస్క్ లో పార్టిసిపేట్ చేసింది.