Advertisement
Google Ads BL

RRR టికెట్స్ దొరడం లేదంటున్న హీరోయిన్


ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి రేపటికి వారం పూర్తవుతుంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లో రిలీజ్ అయిన ట్రిపుల్ మూవీ రిలీజ్ అయిన ప్రతి భాషలో సక్సెస్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంది. రాజమౌళి అద్భుత కళా ఖండం ట్రిపుల్ ఆర్ ని వీక్షించిన ప్రతి ఒక్కరి ట్రిపుల్ ఆర్ టీం ని అప్రిషెట్ చేసారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ పెరఫార్మెన్స్ కి వాళ్ళ గెటప్స్ కి ముగ్దులవుతున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన మూడు రోజుల పాటు బుక్ మై షో లో కానీ, మరే ఇతర చోట్ల ట్రిపుల్ ఆర్ టికెట్స్ దొరకలేదు. కానీ ఇప్పటికి కొన్ని చోట్ల టికెట్స్ దొరకలేదంటుంది ఓ సీనియర్ హీరోయిన్.

Advertisement
CJ Advs

ఆమె ఎవరో కాదు ట్రిపుల్ ఆర్ మూవీ లో అజయ్ దేవగన్ వైఫ్ గా స్వరాజ్యం పాత్ర పోషించిన శ్రీయ శరన్. తాను రాజమౌళి సినిమా అనగానే హీరోలు ఎవరో, తన కేరెక్టర్ ఏమిటో అడక్కుండానే సైన్ చేశాను అని, మొదటి రోజు షూటింగ్  అప్పుడే చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలు అని తెలుసుకున్నాను అన్న శ్రియ ఇంతవరకు తాను సినిమా చూడలేదు అని, తాను ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినప్పుడు ముంబై లో ఉన్నాను అని, కానీ అప్పుడు ఆ సినిమా చూసేందుకు టికెట్స్ కోసం ప్రయత్నించినా టికెట్స్ దొరకలేదని, అలాగే వేరే పని మీద బెంగుళూరు వెళ్లినా అక్కడ కూడా ఇంకా హౌస్ ఫుల్ నడుస్తుంది అని, టికెట్స్ మాత్రం దొరకలేదని.. వచ్చే వారం ఎమన్నా దొరికితే సినిమా చూస్తాను అని చెప్పుకొచ్చింది శ్రియ శరన్.

Shriya Saran couldn't get RRR tickets for film in Mumbai:

Shriya couldn't get tickets for film in Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs