ట్రిపుల్ ఆర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తన కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చారు అంటున్నారు. ఆయన లుక్స్, ఫేస్ ఎక్సప్రెషన్స్, కొమరం భీమ్ గా అమాయకత్వం, అలాగే బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎన్టీఆర్ కి బెస్ట్ అనేలా చేసాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ ఇంగ్లీష్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కెరీర్ ని ట్రిపుల్ ఆర్ కి ముందు ట్రిపుల్ ఆర్ కి తర్వాత అని చెప్పుకుంటారంటూ అంటున్నారు. అయితే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇక ఆయన నెక్స్ట్ మూవీ NTR30 స్టార్ట్ చేస్తారేమో కొరటాలతో అనుకున్నారు. కానీ కొరటాల ఇప్పుడు ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్నారు. అంటే ఏప్రిల్ 29 వరకు కొరటాల బిజీ. సో ఎన్టీఆర్ - కొరటాల కాంబో మూవీ స్టార్ట్ కావడానికి టైం పడుతుంది అనుకుంటున్నారు.
అందరూ అనుకున్నట్టే NTR30 కాస్త లేట్ గా జూన్ నుండి మొదలు కాబోతున్నట్టుగా ఎన్టీఆర్ ఆ ఇంగ్లీష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ క్యూటీ అలియా భట్ నటిస్తుంది. కొరటాల మేకర్స్ NTR30 ఓపెనింగ్ తోనే నేషనల్ వైడ్ గా పబ్లిసిటీ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే NTR30 ఓపెనింగ్ ని అదిరిపోయే లా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూడు నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ కూడా కొరటాల మూవీ కోసమే వెయిట్ లాస్ అవ్వనున్నారని తెలుస్తుంది.