రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీలో రామరాజుగా, పోలీస్ ఆఫీసర్ గా, బ్రిటిష్ వారిని మాయ చేసే ఆఫీసర్ గా.. చివరిలో అల్లూరి అవతారంలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేసారు. సాధారణ ఫాన్స్ కూడా చరణ్ పెరఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. నిజంగానే మంచి బాడీ లాంగ్వేజ్ తో రామ్ చరణ్ అదరగొట్టేసాడు. ఇక రామ్ చరణ్ నుండి మరొక్క నెలలో రాబోతున్నది ఆచార్య మూవీ. మెగాస్టార్ చిరు - రామ్ చరణ్ కలయికలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29 న రిలీజ్ అవ్వబోతుంది.
ఆచార్యలో రామ్ చరణ్ కూడా నటించడం, పూజ హెగ్డే కనిపించడం, కొరటాల కి ఇంతవరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవడం, మెగాస్టార్ చిరు గ్రేస్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసాయి. అయితే ఈ సినిమాలో చరణ్ స్క్రీన్ స్పేస్ పై అందరిలో అనుమానాలు ఉన్నాయి. ఆచార్య మూవీలో రామ్ చరణ్ రోల్ దాదాపు 45 నిమిషాలకు పైగా ఉంటుందని కొరటాల ఎప్పుడో రివీల్ చేసారు. తాజాగా రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చరణ్ రోల్ కేవలం 30 నిమిషాలే ఉంటుందని తెలుస్తోంది. 30 నిమిషాల్లో కూడా మేజర్‌గా చిరంజీవి- రామ్ చరణ్ మధ్య సన్నివేశాలే ఉంటాయని, ఇరువురి కలయికలో వచ్చే సీన్స్ మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.