Advertisement
Google Ads BL

ఆదిపురుష్ అప్ డేట్ నిజమేనా


ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ డిజాస్టర్ మూడ్ నుండి బయట పడుతున్నారు. రాధే శ్యామ్ ప్రభాస్ కి మరిచిపోలేని ప్లాప్ ఇవ్వడంతో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ కె సెట్స్ లోకి రేపో మాపో ఎంటర్ అవ్వబోతున్న ప్రభాస్.. మే నుండి ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ లో జాయిన్ అవుతారు. అయితే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి ఆదిపురుష్ షూటింగ్ ని ఎప్పుడో కంప్లీట్ చేసారు. ఆదిపురుష్ షూటింగ్ తక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ కావడంతో.. షూటింగ్ పూర్తయినా సినిమాని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చెయ్యడానికి డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

అయితే గత ఏడాది ఏప్రిల్ లో వచ్చిన శ్రీరామ నవమి కే ఆదిపురుష్ నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ రాబోతుంది అని అన్నారు. కానీ అప్పుడు యూనిట్ నుండి ఎలాంటి కబురు లేదు. ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కినది.. ఇందులో మోడ్రెన్ రాముడిగా ప్రభాస్, మోడ్రెన్ జానకి గా కృతి సనన్ అలాగే మోడ్రెన్ రావణుడిగా లంకేశ్ పాత్రలో సైఫ్ నటిస్తున్నారని చెప్పారు.

ఇకపోతే ఈ శ్రీరామ నవమి అంటే ఏప్రిల్ 10 కి ఆదిపురుష్ నుండి ప్రభాస్ రామ లుక్ కానీ లేదంటే టీజర్ కానీ రివీల్ చెయ్యబోతున్నారంటూ ఈ ఉదయం నుండి ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. శ్రీరామ్ నవమి స్పెషల్ గా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అంటూ ట్విట్టర్ లో ఆదిపురుష్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆదిపురుష్ యూనిట్ నుండి ఎలాంటి అప్ డేట్ అయితే లేదు. 

AdiPurush to excite all with the teaser?:

AdiPurush first look will be released on 10th April as Srirama Navami special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs