నాగబాబు ఈటీవీలో పర్మినెంట్ గా జబర్దస్త్ కి జేడ్జ్ గా ఆరేళ్లపాటు ఉన్నారు. జబర్దస్త్ తన జీవితాన్ని నిలబెట్టింది అని చాలాసార్లు చెప్పిన నాగబాబు మల్లెమాల తో చిన్నపాటి బేదాభిప్రాయాలతో ఆయన ఈటివి నుండి బయటికి వచ్చేసారు. తర్వాత ఆయన జీ తెలుగులో ప్రసారం అయిన అదిరింది ప్రోగ్రాం కి జేడ్జ్ గా వ్యవహరించారు. అది పెద్దగా సక్సెస్ అవ్వకపోయేసరికి నాగబాబు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అలా అలా గ్యాప్ తీసుకున్న నాగబాబు మళ్ళీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కి జేడ్జ్ గా రావడం మొదలు పెట్టారు. శేఖర్ మాస్టర్ తో కలిసి కామెడీ స్టార్స్ కి జేడ్జ్ గా కొన్నాళ్లుగా స్టార్ మా లోనే కనిపిస్తున్నారు.
అయితే ఇప్పుడు నాగబాబు మళ్ళీ ఛానల్ మార్చేశారా అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ మా లో రెగ్యులర్ గా కనబడుతున్న నాగబాబు ఉగాది ఈవెంట్ కోసం జెమినీ ఛానల్ లో ప్రత్యక్షమయ్యారు. జెమినీ ఛానల్ లో ఉగాది రోజు సాయంత్రం ప్రసారం కాబోతున్న ఉగాది స్పెషల్ ఈవెంట్ ఫుల్ కిక్కు లో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటుగా నాగబాబు జేడ్జ్ గా కనిపించేసరికి.. అయ్యో నాగబాబు మళ్ళీ ఛానల్ మార్చేసారే అంటున్నారు నెటిజెన్స్.