Advertisement
Google Ads BL

వైరల్: సౌత్ మూవీస్ పై సల్మాన్ కామెంట్స్


సౌత్ మూవీస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ గా రిలీజ్ అయ్యి బాలీవుడ్ బాక్సాఫీసుని దడదడలాడిస్తున్నాయి. బాహుబలి 1, బాహుబలి 2, సాహో, నిన్నగాక మొన్న వచ్చిన పుష్ప, రీసెంట్ గా విడుదలైన ట్రిపుల్ ఆర్ మూవీస్ నార్త్ ప్రేక్షకులని మెప్పించడమే కాదు.. అక్కడ కలెక్షన్స పరంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే ట్రిపుల్ ఆర్ ముంబై ప్రమోషన్స్ లోనే ఆ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ లో ఆయన తో కలిసి వర్క్ చెయ్యడం అద్భుతమైన అనుభవం అని, చిరు తనకి చాలా కాలం నుండి తెలుసు అని, ఆయన తనకి మంచి స్నేహితుడు అన్నారు. అంతేకాకుండా ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా తనకి మంచి ఫ్రెండ్ అని, ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ సూపర్ గా నటించాడని, ఆ సినిమా సక్సెస్ అవడంపై సల్మాన్ రామ్ చరణ్ కి అభినందనలు తెలిపారు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ ని చూస్తే గర్వం గా ఉంది అని, రామ్ చరణ్ ఇంతబాగా పెరఫార్మెన్సు చేస్తునందుకు హ్యాపీ గా ఉంది అని అన్న సల్మాన్ ఖాన్ సౌత్ మూవీస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సౌత్ మూవీస్ హిందీ మర్కెట్ లో కోట్లు కొల్లగొట్టి బాగా ఆడుతుంటే.. హిందీ మూవీస్ సౌత్ లో ఆడకపోవడానికి గల కారణాలేమిటో అని ఆలోచిస్తున్నాను అంటూ సల్మాన్ ఖాన్ సౌత్ మూవీస్ హిందీ బాక్సాఫీసుని షేక్ చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి బాహుబలి, సాహో, పుష్ప హిందీలో సూపర్ సక్సెస్ అవడం, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మ్యానియా హిందీ లో బాగా పని చెయ్యడం చూసిన సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. 

Salman Khan talks about South Indian movies:

Salman Khan: Why Are Bollywood Films Not Doing Well In South?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs