Advertisement
Google Ads BL

నిర్మాత పై కోర్టుకెక్కిన హీరో


కొంతమంది నిర్మాతలు ముందు హీరోలకి భారీ పారితోషకం తో సినిమా చెయ్యడానికి ఒప్పించి, ఆ సినిమా హిట్ అయితే మాట్లాడుకున్న పారితోషకాన్ని పూర్తిగా చెల్లిస్తారు కానీ.. ఆ సినిమా అటు ఇటు అయితే మాత్రం ఆ హీరోకి ఎంతో కొంత పారితోషకం ఎగ్గొడతారు. రీసెంట్ గా కోలీవుడ్ లో ఓ హీరో బడా నిర్మాత పై కోర్టు కి వెళ్లి పారితోషకం విషయంలో గొడవ పడడం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న శివ కార్తికేయన్.. స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా పై కోర్టు కి ఎక్కారు. తనకి ఇవ్వాల్సిన పారితోషకం నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఇవ్వకుండా ఎగ్గొట్టారంటూ శివ కార్తికేయన్ మద్రాస్ హై కోర్టుని ఆశ్రయించారు.

Advertisement
CJ Advs

3 ఇయర్స్ బ్యాక్ శివ కార్తికేయన్ హీరోగా జ్ఙానావెల్ రాజా రాజేష్ అనే దర్శకుడితో మిస్టర్ లోకల్ మూవీ తియ్యగా ఆ సినిమా ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఆ సినిమా చేసేటప్పుడే 15 కోట్ల రెమ్యునరేషన్ హీరోకి ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ చేసిన నిర్మాత అప్పుడే ఓ కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. 11 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన 4 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని.. పైగా ఆ ఇచ్చిన 11 కోట్లకు టిడిఎస్ కూడా నిర్మాత చెల్లించలేదు అని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. నిర్మాత ఆ 11 కోట్లకి టిడిఎస్ కట్టారనుకుని శివ కార్తికేయన్ టాక్స్ చెల్లించకపోయేసరికి.. పన్ను ఎగవేత చేసినట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దేశివ కార్తికేయన్ కి నోటీసు రావడంతో అప్పుడు అన్ని చూసుకున్న ఆయన నిర్మాత టిడిఎస్ కట్టలేదని తెలుసుకున్నారట. దానితో శివ కార్తికేయన్ అకౌంట్ నుండి 91 లక్షలు టీడీఎస్ కి కట్ అవడంతో ఇప్పుడు ఆ నిర్మాతపై ఆయన కోర్టుకి వెళ్లారు.

తనకు రావాల్సిన 4 కోట్ల రెమ్యూనరేషన్ అలాగే ఆగిపోయిందని.. తనకి ఆ మొత్తం కట్టేవరకు ఆ నిర్మాణ సంస్థలో వస్తున్న సినిమాలేవీ విడుదల కాకుండా చూడాలి అని.. అలాగే ఆ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులు విక్రయించకుండా ఆపాలి అంటూ మద్రాస్ హైకోర్టులో శివ కార్తికేయన్ పిటిషన్ వేశారు.

Sivakarthikeyan files petition against Gnanavel Raja in HC:

Sivakarthikeyan files petition in HC against producer Gnanavelraja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs