పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ ఇప్పటికే లైగర్ మూవీ తో అంచనాలు ఆకాశంలో ఉంచారు. విజయ్ బాక్సర్ గా ఫుల్ మేకోవర్ అవ్వగా.. రీసెంట్ గా లైగర్ షూటింగ్ కంప్లీట్ చేసి కూల్ అయిన విజయ్ అండ్ పూరి లు మళ్ళీ మరో మూవీని ఎనౌన్స్ చెయ్యడం నేడు ఆ మూవీని ముంబై లో మొదలు పెట్టడం చక చకా జరిగిపోయాయి. పూరి జగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ ని విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవల్లో మొదలు పెట్టేసారు. ఈ సినిమాలో పూరి జాగన్నాధ్ విజయ్ ని పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా చూపించబోతున్నట్టుగా లుక్ కూడా రివీల్ చేసేసారు. లైగర్ లో బాక్సర్ గాను, జన గణ మన లో సైనికుడిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు.
లైగర్ మూవీ ఈ ఏడాది ఆగష్టు 25 న రిలీజ్ అవుతుంటే.. ఇప్పుడే మొదలైన ఈ జన గణ మన వచ్చే ఏడాది అంటే ఆగష్టు 03, 2023 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ తో ప్రకటించేసారు. విజయ్ దేవరకొండ సోల్జర్ గా పవర్ ఫుల్ గా కనిపిస్తుంటే ఆయన వెనుక సైన్యంతో జన గణ మన ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని క్రియేట్ చేసారు. మరి ఈ సినిమాకి కూడా ఛార్మి నే బ్యాక్ బోన్ గా నిలవబోతుండగా.. ఈ సినిమాలో విజయ్ సరసన అందాల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జోడిగా నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.