Advertisement
Google Ads BL

జబర్దస్త్: రోజా ఎంకరేజ్మెంట్ ఏమిటండి


జబర్దస్త్ మొదలైనప్పటినుండి జబర్దస్ కి రోజా జేడ్జ్ గానే కొనసాగుతుంది. అటు జేడ్జ్ గాను ఇటు ఎమ్యెల్యే గాను రోజా బిజీ. అయితే ఇప్పుడు రోజా కి ఎమ్యెల్యే నుండి మంత్రి గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. దానితో రోజా జబర్దస్త్ మానెయ్యొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఇక జబర్దస్ లో జేడ్జ్ గా రోజా ఈ మధ్యన స్టేజ్ పైకి ఎక్కి స్పెషల్ స్కిట్స్ అంటూ కామెడి మొదలు పెట్టింది. అదలా.. ఉంటే జబర్దస్త్ లో రోజా ప్రేమ జంటలు అంటూ కొంతమందిని ఎంకరేజ్ చేస్తుంది అనే కంప్లైంట్ ఉంది. అంటే రష్మీ - సుధీర్ మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ తొమ్మిదేళ్లు  గడిపేశారు. మధ్యలో రోజా నాకో డౌట్ అంటూ స్టేజ్ పైనే వారు ప్రపోజ్ చేసేలా ఎంకరేజ్ చేస్తుండేవారు. అలా వాళ్ళు ప్రేమలో ఉన్నారంటూ జబర్దస్త్ లో పబ్బం గడుపుకున్నారు. 

Advertisement
CJ Advs

కానీ వారు ఎప్పుడూ మేము లవర్స్ కాదంటూనే క్లారిటీ ఇచ్చారు. ఇక మధ్యలో నల్లగా వుండే ఇమ్మాన్యువల్ - తెల్లగా ఉండే వర్ష మధ్యలో ప్రేమ ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వడమే కాదు.. మళ్లీ రోజా మీ మధ్యలో ఏం ఉందో మాకొ డౌట్ అంటూ చెప్పడం, వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వుతో ప్రపోజ్ చేయించడం, మధ్యలో స్టేజ్ పై ఎమోషనల్ డైలాగ్స్ చెప్పించడం చేసింది. ఇక ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై రాకేష్ - బిగ్ బాస్ సుజాత మధ్యన ప్రేమాయణం అంటూ వాళ్ళ మధ్యన ప్రేమ చూపిస్తున్నారు. సుజాత - రాకేష్ మధ్యన ఎంగేజ్మెంట్ అంటూ చూపించడం, రీసెంట్ గా నాకో డౌట్ రాకేష్ గనక నిన్ను వదిలి వేరే అమ్మయితో వెళితే నువ్వేం చేస్తావ్ అని సుజాతని రోజా అడిగింది. దానికి సుజాత ఎమోషనల్ అవుతూ రాకేష్ కి నేను వద్దు అంటూ వేరే అమ్మాయితో వెళ్లాలనిపిస్తే చెప్పమనండి నేను ఇప్పుడే పక్కకి తప్పుకుంటా రాకేష్ హ్యాపీ గా ఉంటే చాలు అనగానే రాకేష్ ఎమోషనల్ అవడం, ఇలా రోజా కామెడీ షో జబర్దస్త్ లో ప్రేమ జంటలను ప్రోత్సహిస్తూ కామెడీ షో ని కాస్తా వేరేలా చేస్తుంది అంటూ చాలామంది నెటిజెన్స్ మంది పడుతున్నారు. 

Jabardasth Rocking Rakesh Sujatha Love Story:

Jabardasth Rakesh Sujatha Marriage?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs