యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకేకించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ అన్ని భాషల్లో బాక్సాఫీసుని ఊచకోత కొస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆ భాషా లేదు ఈ భాషా లేదు అన్ని భాషల్లో ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. దానితో ఈ సినిమాలో యాక్ట్ చేసిన రామ్ చరణ్ రాజమౌళి తో సహా ఫాన్స్ కి ఓ నోట్ రాస్తూ ఎమోషనల్ అవ్వగా.. నేడు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ విజయం సాధించడంతో మనసు నిండిపోయి దర్శకుడు రాజమౌళి దగ్గర నుండి తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ వరకు, అలాగే డాన్స్ మాస్టర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వరకు అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసారు.
ఆర్ ఆర్ ఆర్ కి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు. సినిమా విడుదలైనప్పటినుండి మమ్మల్ని మీ ప్రేమతో ముంచెత్తుతున్నారు. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచిన RRRను ఇంట సక్సెస్ వైపు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేయాలనుకుంటున్నాను.
రాజమౌళి: ముఖ్యంగా జక్కన్నకి ప్రత్యేక కృతఙ్ఞతలు. మీరు నాలోని ఉత్తమైన నటుడుని బయటికి తీసుకువచ్చారు. నన్ను నీరుగా చూపించి వెర్సటైల్ అనిపించేలా చేశారు. మీరు అనుకున్న క్యారెక్టర్ లోకి నన్ను మౌల్డ్ చేయడమే కాక ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎమోషనల్, అమాయకత్వం ఇలా అన్ని విషయాలను చాలా ఈజ్ తో ప్రేక్షకులు అర్థం చేసుకునే విధంగా నటించడంలో నాకు మీరు సహాయపడ్డారు.
రామ్ చరణ్: రామ్ చరణ్ సోదరా.. నువ్వు లేకుండా ఆర్ ఆర్ ఆర్ లో నటించడాన్ని నేను ఊహించుకోలేక పోతున్నాను. నువ్వు కాకుండా మరెవరూ అల్లూరి సీతారామరాజు కేరెక్టర్ కి న్యాయం చేయగలరు అని నేను అనుకోవడం లేదు. నేను పోషించిన భీమ్ పాత్ర కూడా నువ్వు లేకుండా సంపూర్ణం కాదు. నా నీటికి నువ్వు అగ్నిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
అజయ్ దేవగన్ సార్.. మీతో కలిసి నటించడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను, ఈ మెమరీని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను.
అలియా-ఒలీవియా : అలియా భట్.. మీరు పెరఫార్మెన్స్ విషయంలో ఒక పవర్ హౌస్, ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఒలీవియా మోరిస్, అలిసన్ డ్యూడీ, రే స్టీవెన్సన్ అందరికి ధన్యవాదాలు. మీ పర్ఫామెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
డివివి దానయ్య గారు మీరు ఒక రాక్, ఆర్ ఆర్ ఆర్ అనే కలను నిజం చేయడానికి నిరంతరం కృషి చేసిన మీకు ధన్యవాదాలు.
ఆర్ ఆర్ ఆర్ కి మ్యూజిక్ అందించిన కీరవాణి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మీ మ్యూజిక్ తో ఆర్ ఆర్ ఆర్ స్థాయిని పెంచారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అందించినందుకు విజయేంద్ర ప్రసాద్ గారికి నేను రుణపడి ఉంటాను.
సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గారికి, శ్రీకర్ ప్రసాద్ గారికి శ్రీనివాస్ మోహన్ గారికి అలాగే ప్రతి డిపార్ట్మెంట్ లో పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
కార్తికేయ నువ్వు ఈ సినిమా మొత్తానికి మెయిన్ పిల్లర్ లాంటి వాడివి, ప్రతి విషయాన్ని కో-ఆర్డినేట్ చేసుకుంటూ సినిమా మొత్తం సాఫీగా సాగడానికి కారణం అయినందుకు ధన్యవాదాలు.
కొమరం భీముడు అనే సాంగ్ పాడిన కాలభైరవకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.. ఆ పాటతో అనేక లక్షల మంది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేలా చేశావు.
నాటు నాటు అనే సాంగ్ కి ఒక కొత్త మాస్ స్టెప్ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి స్పెషల్ థాంక్స్.
నేను నేషనల్ మీడియాకి కేవలం థాంక్స్ చెప్పి తప్పించుకోలేను. సినిమా గురించి వాళ్ళ అప్రిసియేషన్ సినిమాకు వాళ్ళు ఇచ్చిన మద్దతు అద్భుతమైనది. RRR సినిమాని ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఫిలిం కాకుండా ప్రపంచానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఫిలింగా మార్చిన ఇండియన్ మీడియా కి ధన్యవాదాలు.
చివరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను నా ఫ్యాన్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అన్ కండిషనల్ సపోర్ట్ లాంటివి కరోనా లాంటి ఎంతో కఠినమైన సమయాల్లో కూడా నేను ముందుకు నడవడానికి కారణమయ్యాయి. ఇక ముందు కూడా మీకు నచ్చిన, మెచ్చిన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను అంటూ.. ఆ లేఖలో రాసారు.