Advertisement
Google Ads BL

బ్రహ్మాస్త్ర షూటింగ్ ఫినిష్


రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, కరణ్ జోహార్, అలియా భట్ కలయికలో బడా మల్టి స్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌లో వస్తున్న అద్భుతమైన సినిమా బ్రహ్మాస్త్ర. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో బ్రహ్మాస్త్ర విజన్‌ని రాజమౌళి అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇండియన్ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన వారణాసిలో పూర్తయింది. ఇదే విషయాన్ని తెలియచేసారు దర్శక నిర్మాతలు. బ్రహ్మాస్త్ర చివరి షెడ్యూల్ అక్కడే పూర్తి చేసారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే బ్రహ్మాస్త్ర ప్రమోషన్ సౌత్‌లో కూడా అద్భుతంగా మొదలైంది. కొన్ని స్నేహాలు, కొన్ని సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవి. అలా బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాతో కలిసిన స్నేహం కరణ్ జోహార్, S.S. రాజమౌళి సొంతం. ఇప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా సౌత్ వర్షన్స్ ప్రజెంట్ చేయడానికి దర్శక ధీరుడు రాజమౌళి వచ్చారు. భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన పురాణ సమ్మేళనం బ్రహ్మాస్త్ర సినిమా. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. 

ఈ మధ్యే విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. 09.09.2022న బ్రహ్మాస్త్ర సినిమా విడుదల కానుంది. ఆ రోజు కచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త చరిత్ర మొదలవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మూడు భాగాలుగా వస్తున్న బ్రహ్మాస్త్రలోని మొదటి భాగం అప్పుడే రానుంది. రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి మొదటిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లోకి రాజమౌళి కూడా రావడంతో రేంజ్ ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Brahmastra finishes the final leg:

<span>Brahmastra wraps shoot</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs