Advertisement
Google Ads BL

సూర్య సరసన ఛాన్స్ పట్టేసిన లక్కీ బ్యూటీ


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈమధ్యనే ఈటి మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ సినిమా లో సూర్య ప్రియాంక మోహన్ తో రొమాన్స్ చెయ్యగా.. ఇప్పుడు సూర్య బాల దర్శకత్వంలో సూర్య41 ని నేడు అఫీషియల్ గా మొదలు పెట్టేసారు. ప్రస్తుతం విభిన్న కథ లతో శరవేగం గా దూసుకుపోతున్న హీరో సూర్య 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన డైరెక్టర్ బాల తో కలిసి పని చేయనున్నారు. వీరు ఇరువురు కలిసి చేసిన చివరి చిత్రం శివపుత్రుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, ఈ చిత్రం లో సూర్య పాత్ర కి తెలుగు ,తమిళం లో  మంచి పేరు రావడంతో ప్రేక్షకులలో ఈ కాంబో పై అంచనాలు పెట్టుకుంటున్నారు. నా గురువు లాంటి వ్యక్తి బాల యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా, 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది ఇప్పుడు జరిగింది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో సూర్య లక్కీ బ్యూటీ కృతి శెట్టి తో రొమాన్స్ చెయ్యబోతున్నారు. వరస సక్సెస్ లతో లక్కీ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి హీరో రామ్ ద వారియర్ తో మొదటి సరి తమిళ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పుడు ఆ సినిమా అక్కడ రిలీజ్ కాకుండానే.. సూర్య లాంటి అగ్ర తమిళ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో నితిన్ మాచర్ల నియోజక వర్గం, రామ్ ద వారియర్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో బిజీగా వుంది కృతి శెట్టి.

Krithi Shetty onboard for Suriya41:

Suriya and Director Bala unite in 2D Entertainment Suriya41
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs