Advertisement
Google Ads BL

ఫాన్స్ మీసం మెలేసే పోస్టర్


గత మూడు రోజులుగా ట్రిపుల్ ఆర్ థియేటర్స్ దగ్గర ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ చేసిన రచ్చ మాములుగా లేదు. మూవీ ని లైక్ చేసే ప్రతి వారు ట్రిపుల్ మూవీ టికెట్స్ కోసం ఎగబడ్డారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వారు మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్ డే ఫాన్స్ గోల, వాళ్ళు చేసిన రచ్చ తో థియేటర్స్ లో కొన్ని డైలాగ్స్ ని, అలాగే మ్యూజిక్ ని ఎంజాయ్ చేయలేకపోయిన ఆడియన్స్ మళ్ళీ థియేటర్స్ కి వెళ్లి మూవీ ని ఆస్వాదిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ తో విడుదలైన అన్ని భాషల్లోనూ ట్రిపుల్ ఆర్ ప్రభంజనం సృష్టిస్తుంది. 

Advertisement
CJ Advs

అందుకే తమ సినిమాకి వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 500 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా ట్రిపుల్ ఆర్ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి గా మీసం మెలేసే పోస్టర్ తో తమ కలెక్షన్స్ 500 కోట్లు అంటూ ప్రకటించడం తో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ అలా మీసం మెలితిప్పుతూ పోస్టర్ లో 500 కోట్ల అంకె కనిపించేసరికి నిజంగానే చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ మీసం మిలితిప్పడం ఖాయంగా కనిపిస్తుంది. చరణ్ - ఎన్టీఆర్ ఈక్వెల్ గా పెరఫార్మెన్స్ తో ఫాన్స్ అంచనాలను రీచ్ అయ్యి ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు.

RRR Movie has crossed 500 crores:

RRR Movie has crossed 500 crores in no time and is inching towards 750
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs