రాజమౌళి ట్రిపుల్ ఆర్ పై ఎంత ఆసక్తి, ఎంత క్యూరియాసిటీ, ఎన్ని అంచనాలున్నాయో.. ఆ సినిమా రిలీజ్ టైం కి కొంత నెగెటివిటి కూడా మొదలయ్యింది. కారణం సినిమా పై ఉన్న అపనమ్మకం కాదు. టికెట్ ప్రైజ్ విషయంలో మిడిల్ క్లాస్ ఆడియన్స్, సాధారణ ఆడియన్స్ చాలా టెంక్షన్ పడ్డారు. రాజమౌళి సినిమా. అందులో స్టార్ హీరోలు కలిసి నటించిన పాన్ ఇండియా ఫిలిం చూడాలనే కోరిక ఫాన్స్ లోనే కాదు.. ప్రతి మూవీ లవర్ లోను ఉంటుంది. కానీ ట్రిపుల్ ఆర్ కి పెంచేసిన టికెర్ రేట్స్ చూసిన సాధారణ ఆడియన్స్ గుండెలు గుభేల్ మన్నాయి. మొదటి పది రోజులు అదే టికెట్ ప్రైజ్ అమలులో ఉంటుంది అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్ ఆర్ మేకర్స్ పరిమిషన్స్ తెచ్చుకోవడమే కాదు.. అదనంగా ఐదు షొలకి అనుమతి తెచ్చుకున్నారు. దానితో ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలి, మొదటి వీకెండ్లోనే సినిమా చూడాలనుకున్న వారి జేబులకు చిల్లులు పడ్డాయి.
అ దెబ్బకి ట్రిపుల్ ఆర్ మేకర్స్ ని మిడిల్ క్లాస్ ఆడియన్స్ తిట్టిపోశారు. అయితే ఈ సోమవారం నుండి ట్రిపుల్ ఆర్ మేకర్స్ ఓ డెసిషన్ తీసుకున్నారు. అదేమిటంటే సినిమా రిలీజ్ అయిన ఓ పదిరోజుల పాటు అనుమతి ఉన్న ఐదో ఆట విషయంలో ట్రిపుల్ ఆర్ మేకర్స్ స్వచ్ఛందంగా వెనక్కి తగ్గారు. అంతేకాకుండా పెంచిన టికెట్ ప్రైజ్ కూడా పది రోజుల పాటు అనుమతి ఉన్నప్పటికీ.. ఈ రోజు ఆ విషయంలోనూ మేకర్స్ డ్రాప్ అయ్యి సామాన్య మానవుడి కి ట్రిపుల్ ఆర్ చేరువయ్యేలా చేసారు. రోజుకి నాలుగు ఆటలు, సాధారణ టికెట్ రేట్స్ తో సామాన్య ప్రేక్షకుడికి ట్రిపుల్ ఆర్ ని అందుబాటులోకి తీసుకురావడంతో ట్రిపుల్ ఆర్ మేకర్స్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.