Advertisement
Google Ads BL

RRR ఆరాటం ముగిసింది.. ఇకపై


ప్రపంచం మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూసిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ఆరాటం ముగిసిపోయింది. గత శుక్రవారమే విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీ పాజిటివ్ టాక్ తో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసు సునామీని సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీలోనూ ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం సృష్టించింది. మొదటి రోజు 25 కోట్లు కొల్లగొట్టింది. ఆ భాష లేదు, ఈ భాష లేదు అన్ని చోట్ల ఒకటే మాట ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెరఫార్మెన్స్ సూపర్ అని. చరణ్ అండ్ ఎన్టీఆర్ పెరఫార్మెన్స్ చూసిన వారి కెరీర్ బెస్ట్ అంటూ ముక్త ఖంఠంతో చెబుతున్నారు. కొమరం భీం గా ఎన్టీఆర్, రామరాజు గా రామ్ చరణ్ లు అద్భుతమైన నటనతో అందరి ప్రశంశలు అందుకుంటున్నారు.

Advertisement
CJ Advs

 

రాజమౌళి దర్శకత్వానికి, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అందరూ మైమరిచిపోతున్నారు. మరి మరో వారం అయితే ఆర్ ఆర్ ఆర్ ఆరాటం పూర్తిగా ముగిసిపోతుంది. ఇకపై కెజిఎఫ్ 2 ఫీవర్ స్టార్ట్ అవుతుంది. కన్నడ సంచలనం కెజిఎఫ్ 2 కోసం ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ - యష్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ అంచనాలు లేకుండానే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టడంతో.. దానికి పార్ట్ 2 గా వస్తున్నా కెజిఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం కరణ్ జోహార్, శివ రాజ్ కుమార్ గెస్ట్ లుగా కెజిఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూర్‌లో జరగబోతుంది. కెజిఎప్ చాప్టర్ 2 తెలుగు ట్రైలర్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 14 వరకు కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ తో సోషల్ మీడియా, మీడియా హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

RRR Promotions Over and Then KGF Hungama starts:

KGF Chapter 2 Promotions in Full Swing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs