ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ డిస్పాయింట్ చేసింది ఫాన్స్ ని. రాధే శ్యామ్ రిలీజ్ ప్రమోషన్స్ తర్వాత ప్రభాస్ వెకేషన్స్ కి చెక్కేశారు. అంతకు ముందు ప్రాజెక్ట్ కె షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఏప్రిల్ 15 తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ లో జాయిన్ అవుతారని అనుకుంటున్నారు. అసలైతే సలార్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. కరోనా దెబ్బకి సలార్ డేట్ కి కెజిఎఫ్ 2 వస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు.
ఇక ప్రభాస్ కూడా రాధే శ్యామ్ ప్లాప్ మూడ్ నుండి తేరుకుని ప్రాజెక్ట్ కె, సలార్ షూట్ చేస్తారని అనుకుంటున్నారు. ఇక సలార్ మూవీ ఈ ఏడాది చివరి లో విడుదల ఉండొచ్చు అనుకున్నారు. కానీ సలార్ మూవీ షూటింగ్ అయితే 30 శాతం పూర్తయ్యింది అని, మే నుంచి సలార్ తదుపరి షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది అని, వచ్చే వేసవిలో సలార్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము అంటూ సలార్ నిర్మాత చెప్పడంతో.. ప్రభాస్ ఫాన్స్ కాస్త ఫీలవుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు లో రావాల్సిన ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి షిఫ్ట్ అయ్యింది. సలార్ అయినా ఈ ఏడాదే ఉంటుంది అనుకుంటే వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్ళిపోయింది అంటూ డిస్పాయింట్ అవుతున్నారు.