Advertisement
Google Ads BL

తెర కాపాడుకుంటే థియేటర్ పగిలింది


విచిత్రంగా విజయవాడ అన్నపూర్ణ థియేటర్ లో రాధే శ్యామ్ మూవీ రిలీజ్ టైం లో ప్రభాస్ ఫాన్స్.. రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ సీన్ చూడగానే పూనకాలు తెచ్చుకుని తెర కి పాలాభిషేకం చెయ్యడంతో.. తెర పాడైపోయి థియేటర్ యజమాన్యానికి 15 లక్షల తుప్పు వదిలింది. ఆ తెర ని బాగుచేయించుకోవడానికి 15 లక్షలు పెట్టాల్సి వచ్చింది. దానితో అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం ట్రిపుల్ ఆర్ ఫాన్స్ నుండి తెర ని కాపాడుకోవడానికి గాను కొత్త తెర దగ్గరకి రాకుండా మేకులు కొట్టేసుకున్నారు. ట్రిపుల్ ఆర్ ఫాన్స్ ఎవరూ తెర వద్దకు రాకుండా భారీ ఏర్పాట్లు చేసుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ తీరా ఇప్పుడు థియేటర్ బద్దలయింది. తెర ని కాపాడుకున్నామనుకున్నవారికి థియేటర్ అద్దాలు పగిలాయి. కారణం ట్రిపుల్ ఆర్ మూవీ సాంకేతిక కారణాలతో విడుదల అవ్వాల్సిన సమయానికి బొమ్మ పడకపోవడంతో తిక్కరేగిన ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ అన్నపూర్ణ థియేటర్ అద్దాలు పగలగొట్టి రచ్చ రచ్చ చేసిన వీడియో ఇప్పడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ట్రిపుల్ ఆర్ షో సమయానికి వేయకపోవడంతో ఆగ్రహించిన ఫాన్స్ థియేటర్ అద్దాలు పగలగొట్టి హంగామా సృష్టించారు. పాపం తెరని కాపాడుకుందామనుకుంటే అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యానికి ఇప్పుడు అద్దాలు పగిలాయి. 

The RRR movie at Vijayawada Annapurna Theater was canceled:

The RRR movie at Vijayawada Annapurna Theater was canceled due to technical reasons. Outraged fans smashed the theater mirrors.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs