Advertisement
Google Ads BL

ట్రిపుల్ ఆర్ పై చిరు ట్వీట్


RRR విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ పోటాపోటీగా పెరఫార్మెన్స్ చూపించారు అని, కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అని, ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్,హీరోల ఇంటర్డక్షన్ సీన్స్ అంటూ సినిమా ప్రముఖులు తో పాటుగా సాధారణ ఆడియన్స్ కూడా చెబుతున్న మాట. విడుదలైన ప్రతి భాషలోనూ ట్రిపుల్ ఆర్ కి పాజిటివ్ రివ్యూస్ పడిపోయాయి. బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ అయితే ట్రిపుల్ ఆర్ మూవీ చూసి 4 రేటింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలోనూ, హిందీలోనూ హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక రామ్ చరణ్ తన వైఫ్ తో కలిసి భ్రమరాంభలో ట్రిపుల్ ఆర్ మూవీ చూస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో AMB మాల్ లో ట్రిపుల్ ఆర్ ని చూసి ఎంజాయ్ చేసారు. ఇక మెగాస్టార్ చిరు ట్రిపుల్ ఆర్ మూవీ చూసిన తర్వాత కథలను తెరకెక్కించడంలో మాస్టర్ అనిపించుకున్న వ్యక్తి, రాజమౌళి నుంచి వచ్చిన అద్భుత కళాఖండం ట్రిపుల్ ఆర్ అని, మంత్రం ముగ్దుల్ని చేసి, వెలుగుదివ్వెలా ఉన్న ఈ చిత్రం రాజమౌళి అసమాన సినిమా దార్శనికతకు నిదర్శనం అని, ఎన్టీఆర్ నటన, చరణ్ నటన సూపర్ అని, యావత్ చిత్రబృందానికి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేసారు.

Chiranjeevi enjoys RRR:

Mega Star raves about RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs