Advertisement
Google Ads BL

భర్త సినిమా చూస్తూ ఉపాసన రచ్చ


రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ట్రిపుల్ ముచ్చట తీరింది. మూడేళ్ళుగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి రాజమౌళి ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చేసారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలివేషన్ సీన్స్, అలాగే రామ్ చరణ్ కేరెక్టర్ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ బాంగ్, దోస్తీ కోసం ప్రాణత్యాగానికి సిద్దపడే సీన్స్ చూసిన మెగా ఫాన్స్ జై రామ్ చరణ్ అంటూ థియేటర్స్ లో కేకలు పెడుతూ హోరెత్తిస్తున్నారు. అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ చేసిన యాక్షన్ కి ఆయన ఫాన్స్ మాత్రమే కాదు.. ఆయన వైఫ్ ఉపాసన కూడా థియేటర్ లోకాగితాలు విసురుతూ భర్త చరణ్ మూవీ ని ఎంజాయ్ చేసింది.

Advertisement
CJ Advs

హైద‌రాబాద్‌లోని భ్ర‌మ‌రాంభ థియేట‌ర్‌లో ట్రిపుల్ ఆర్ మూవీ చూసేందుకు రామ్ చ‌ర‌ణ్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. త‌న భార్య ఉపాస‌న‌తో పాటు ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి సినిమా చూశారు. అయితే సినిమా చూస్తుండగా థియేటర్‌లో రామ్ చరణ్ సీన్స్ వచ్చినప్పుడు ఫాన్స్, ఆడియన్స్ కేకలు పెడుతూ ఉత్సాహంతో పెద్ద ఎత్తున కాగితాలు చించి పైకి విసిరేశారు. దానితో ఉపాసన కూడా ఆ సీన్స్ ని, ఆడియన్స్  కేకలను ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉన్న కాగితాలను ఏరుకుని మరీ పైకి ఎగరేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన భర్త రామ్ చరణ్ సినిమాను థియేటర్‌లో ఉపాసన అలా ఎంజాయ్ చేస్తూ చూడడం అనేకమందిని ఆకట్టుకుంది.

RRR: Upasana celebrates Ram Charan entry:

RRR: Wife celebrates Mr. C star power
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs