Advertisement
Google Ads BL

పిక్ టాక్: పాపం ఎన్టీఆర్


రామ్ చరణ్, ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ చిత్రీకరణలో ఎంతగా ఇబ్బంది పడ్డారో, ఎంతగా కష్ట పడ్డారో అనేది వారు ప్రమోషన్స్ లో చెప్పినప్పుడు తెలిసింది. ఒళ్ళు హూనమైపోయేది. ఒక్కోసారి మోనిటర్ పగలగొట్టాలనిపించేది, రాజమౌళి మోహంలో ఎలాంటి సింపతీ ఉండేది కాదు, అలసిపోయి పడుకున్నప్పుడు నెక్స్ట్ షాట్ కోసం రెడీ అవ్వాలి, రామ్ చరణ్ అయితే ఫీవర్ గా ఉన్న టైం లోను కార్తికేయ 1000 మంది ఆర్టిస్ట్ లు మీ కోసం రెడీగా ఉన్నారనగానే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాం, కొన్ని యాక్షన్ సీన్స్ టైం లో ఒళ్ళు నొప్పులతో విలవిల్లాడము అంటూ ఇద్దరు హీరోలు ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చారు.

Advertisement
CJ Advs

మరి ఆ కష్టాన్ని ఎవరూ చూడలేదు. అయితే ఇప్పుడు వారి కష్టాన్ని ప్రత్యక్షంగా ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో చూసారు. గత ప్రమోషన్స్ లో కొద్దిగా గ్యాప్ తీసుకుని ప్రముఖ సిటీస్ లో ప్రెస్ మీట్స్ పెట్టినా, ఇప్పుడు ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తెర ముందు కష్టపడితే తెర వెనుక రాజమౌళి కొడుకు కార్తికేయ, రమా లాంటి వాళ్ళు కష్టపడ్డారు. ఉదయం ఓ సిటీలో ప్రెస్ మీట్, సాయంత్రం మరో సిటీలో ప్రెస్ మీట్, ఒకరోజు దుబాయ్, మరో రోజు బెంగుళూర్ అంటూ నిద్రాహారాలు మానేసి ఎన్టీఆర్, చరణ్, కార్తికేయ, రాజమౌళిలు కష్టపడ్డారు. 

అయితే వీరంతా ప్రవేట్ జెట్ లో ట్రావెల్ చేస్తూ ఇలా ప్రమోషన్స్ చేసారు. ఇక ట్రావెలింగ్ లోనే నిద్ర పోతున్నారు, తింటున్నారు. ఎన్టీఆర్, కార్తికేయ ఫ్లైట్ లో పడి నిద్రపోయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెర ముందు ఎన్టీఆర్, తెర వెనుక కార్తికేయ ఎంతగా కష్టపడి అలిసిపోయారో కానీ.. ఆ ఫ్లైట్ లో ఒకరు మీద ఒకరు పడి నిద్ర పోతున్నారు. అలా చూస్తుంటే పాపం ఎన్టీఆర్.. ఆయనకి ఎంత కష్టం వచ్చింది అనేస్తున్నారు ఆయన ఫాన్స్. 

Tired Karthikeya and NTR sleeping in flight:

Karthikeya using NTR as his pillow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs