టాలీవుడ్ డ్రగ్స్ కేసుని తెలంగాణ ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది అంటూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పీఠం ఎక్కకుముందు నుండే రేవంత్ రెడ్డి పదే పదే టిఆర్ ఎస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. టాలీవుడ్ లో 12 మంది డ్రగ్స్ కేసులో విచారణకు కూడా హాజరయ్యాక.. డ్రగ్స్ కేసు అనేది లేకుండా కొట్టేసారు. కానీ ఈడీ ఊరుకుంటుందా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసుని మనీ లాండరింగ్ కేసుతో ముడిపెట్టి మరీ బయటికి లాగుతూనే ఉంది. కానీ తెలంగాణ పోలీస్ లు ఈడీకి సహకరించడం లేదు. ఇప్పటికే డ్రగ్స్ కేసుకి సంబందించిన వివరాలని ఫైల్స్ ని ఈడీకి ఇవ్వాలంటూ తెలంగాణ పోలీస్ లకు ఆదేశాలిచ్చినా ఇంతవరకు జరగలేదు. దానితో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసులో సంబంధం ఉన్నవారి కాల్ డేటా, సాక్ష్యుల డిజిటల్ డేటా, నిందితుల వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ ఎక్సయిజ్ శాఖకి లేఖ రాసినా.. ఈడీకి వివరాలు అందజెయ్యకపోవడంతో ఈడీ తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను మెన్షన్ చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటివరకు ఈ డ్రగ్స్ కేసు నుండి సెలబ్రిటీస్ ని, టాలీవుడ్ ప్రముఖుల్ని తెలంగాణ ప్రభుత్వం కాపాడడానికి ట్రై చేస్తుంది అంటూ చాలామంది అంటున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఈ కేసుని వదిలించేందుకు రెడీ అయ్యింది. కానీ ఈడీ ఊరుకోవడం లేదు. ఈసారి ఈకేసు నుండి టాలీవుడ్ ని ఎవరూ కాపాడలేరు అంటున్నారు.