Advertisement
Google Ads BL

దెబ్బకి దిగొచ్చిన ట్రిపుల్ ఆర్ మేకర్స్


ఈ రోజు ఉదయం నుండి కన్నడ ప్రేక్షకులు ట్రిపుల్ ఆర్ విషయంలో విషం చిమ్ముతున్నారు. అందులో కన్నడ ఆడియన్స్ తప్పు కూడా లేదు. ఎందుకంటే అక్కడ కన్నడలో కన్నడ వర్షన్ ట్రిపుల్ ఆర్ కన్నా తెలుగు వర్షన్ ట్రిపుల్ ఆర్ రిలీజ్ చెయ్యడం, కన్నడలో సినిమా చూసేందుకు బుక్ మై షో ఓపెన్ చేస్తే అక్కడ కన్నడ వర్షన్ టికెట్స్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో తిక్కరేగిన కన్నడ ప్రేక్షకులు #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌ ని ట్రెండ్ చేస్తూ ట్విట్టర్ లో మోత మోగించేస్తున్నారు. దానితో దిగొచ్చిన ట్రిపుల్ ఆర్ కన్నడ మేకర్స్ కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Advertisement
CJ Advs

ఆ నోట్ లో ప్రియమైన ప్రేక్షకులారా.. ట్రిపుల్ ఆర్ మార్చి 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ట్రిపుల్ ఆర్ లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కన్నడ నేర్చుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేశారు. వారి సొంత డబ్బింగ్ తోనే ట్రిపుల్ ఆర్ రాబోతుంది. మీరు కన్నడ భాషలో మాగ్నమ్ ఓపస్‌ను ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారని మాకు అర్ధమైంది. అందువల్ల ట్రిపుల్ ఆర్ కన్నడ వెర్షన్‌ను ప్లే చేయడానికి.. కన్నడ థియేటర్ యజమానులను ఒప్పించే పనిలో ఉన్నారు. కన్నడ వెర్షన్‌ను రేపటికల్లా అన్ని స్క్రీన్‌లలోకి తీసుకురావడానికి మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ తర్వాత మరిన్ని స్క్రీన్‌లను యాడ్ చేయడంలో తర్వాత మాకు సహాయపడతారని మేము ఆశిస్తున్నాము అంటూ ఆ నోట్ లో రాసారు.

Karnataka calling for RRR boycott!:

RRR: Boy cott RRR Trends In Karnataka 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs