Advertisement
Google Ads BL

అభిమానిని చూసి భయపడ్డ రామ్ చరణ్


అభిమానులు ఎలా ఉంటారో, తమ అభిమాన హీరోల కోసం ఏం చేస్తారో చాలాసార్లు చూసాం, విన్నాం కూడా. ఆమధ్యన మెగా ఫాన్స్ ఒకరు ఎక్కడినుండో కాలినడకన వచ్చి రామ్ చరణ్ ని కలుసుకున్నాడు. ఇంకా హీరోల సినిమాల రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చేసే హంగామానే హీరోలకి బలం. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో RC 15 షూటింగ్ లో పాల్గొన్నారు. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు రామ్ చరణ్ కోసం ఓ ఆభిమాని తరచూ అక్కడికి వచ్చి అక్కడే తిరుగుతుండేవాడట. అలానే చాలా రోజులు జరిగిందట. ఆ విషయం చరణ్ బాడీ గార్డ్స్ చరణ్ కి చెప్పారట. సరే అతన్ని ఓసారి కలుద్దాం అని చరణ్ అనుకున్నా మేకప్ లో ఉన్నప్పుడు ఎవరినీ కలివద్దని శంకర్ చెప్పడం తో ఆగిపోయారట.

Advertisement
CJ Advs

అయితే ఓ పది రోజుల తర్వాత ఆ అభిమాని గుండెలపై పెద్ద టాటూ వేయించుకుని కనిపించాడని.. నేను అతని దగ్గరికి వెళ్లి ఎప్పుడు వేయించుకున్నావ్ ఆ టాటూ అని అడిగితే నిన్ననే వేయించుకున్నాని అన్నాడు. మిమ్మల్ని కలవడం కోసం ఆ టాటూ వేయించుకున్నాను అని చెప్పినపుడు బాధ తో పాటు భయం వేసింది. హీరోల కోసం పేర్లని పచ్చ బొట్టు వేయించుకోవడం ఏమో కానీ, ఇలా నన్ను కలవడం కోసమే గుండెల మీద పెద్ద పచ్చ బొట్టు వేయించుకోడం చూసి భయం వేసింది అంటూ చరణ్ తన అభిమానితో తన అనుభవాన్ని ట్రిపుల్ ఆర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Ram Charan was scared to see a fan:

Ram Charan about crazy fan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs