ట్రిపుల్ ఆర్ ముచ్చట తీరడానికి జస్ట్ కొన్ని అవర్స్ అయితే తీరిపోతుంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు రావడానికి ఒకే ఒక్క రోజు టైం ఉంది. మార్చ్ 25 కోసం ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ తెగ వైట్ చేస్తున్నారు. అటు రాజమౌళి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ (హీరోయిన్ అలియా భట్) తో కలిసి ఊరూరూ తిరుగుతున్నారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం బెంగుళూరు, వారణాసి, ఢిల్లీ, అమృత్ సర్ ఇలా చాలా సిటీస్ లో ట్రిపుల్ ఆర్ ఈవెంట్స్ తో వేడెక్కిస్తున్నారు. కన్నడ - ఆంధ్ర సరిహద్దుల్లో ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి కన్నడ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అక్కడికి శివ రాజ్ కుమార్ ని గెస్ట్ గా రప్పించారు.
అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందు కన్నడలో మేకర్స్ కి భారీ షాక్ తగిలింది. అక్కడ కన్నడలో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదని కొందరు, శివ రాజ్ కుమార్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ చాలామంది #BoycottRRRinKarnataka హాష్ టాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ మేకర్స్ కి షాకిస్తున్నారు. అలా కన్నడ ఆడియన్స్ #BoycottRRRinKarnataka హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తుంటే ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ ధీటుగా వారికి రిప్లై ఇస్తున్నారు. ఒకవేళ #BoycottRRRinKarnataka అదే జరిగితే రేపు రాబోయే కెజిఎఫ్ 2 ని మిగతా అన్ని భాషల్లో బాయ్ కట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటుంటే.. మరికొందరు ఇలాంటి కల్చర్ సినిమా మనుగడకే ప్రమాదం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.