ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ బోసి పోయింది. ఎందుకంటే శుక్రవారం విడుదల కాబోతున్న ట్రిపుల్ ఆర్ ఫీవర్ తో ఫాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారు. ట్రిపుల్ ఆర్ మార్చ్ 25 అనగానే.. మిగతా సినిమాల మేకర్స్ కామ్ అయ్యారు. గత నాలుగైదు రోజులుగా సినిమా ఇండస్ట్రీ లో ఏ సినిమా ప్రమోషన్స్ లేవు. కేవలం సోషల్ మీడియా ప్రమోషన్స్ తప్ప. ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక్క ఈవెంట్ లేదు. ఒక్క ఇంటర్వ్యూ లేదు. గత వారం రాజమౌళి హైదరాబాద్ లో ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తరవాత ఆయన తన హీరోలనేసుకుని ఇండియాలోని ప్రధాన నగరాల్లో తిరుగుతున్నారు తప్ప హైదరాబాద్ లో మళ్ళీ అడుగుపెట్టలేదు.
అయినప్పటికీ ఒక్క చిన్న సినిమా కానీ, మీడియా సినిమాలు కానీ ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యడం లేదు. ఏది చేసినా అందరి అటెంక్షన్ ట్రిపుల్ ఆర్ పై ఉన్నప్పుడు వేస్ట్ కదా అని అనుకున్నారేమో.. ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో, వెబ్ సైట్స్ లోను ట్రిపుల్ ఆర్ వీడియోస్ కనిపిస్తున్నాయి.. ట్రిపుల్ ఆర్ ఇంటర్వూస్ వినిపిస్తున్నాయి. కానీ మిగతా ఏ ఈవెంట్స్ లేవు. జరగడం లేదు, దానితో ఈవెంట్స్ లేని ఇండస్ట్రీ అంటున్నారు నెటిజెన్స్. ఇక ఫ్రైడే ఎర్లీ అవర్స్ లోనే ట్రిపుల్ ఆర్ సందడి హైదరాబాద్ లో మొదలు కాబోతుంది. ఆ రోజు నుండి ఇండస్ట్రీలో ట్రిపుల్ ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ఏమో కానీ మిగతా సినిమాల ఈవెంట్స్ మాత్రం మొదలవుతాయి.