ఏప్రిల్ 14 మాస్ జాతర కి రెడీ అవుతుంది. కన్నడ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ - యశ్ లు కెజిఎఫ్ 2 తో మరోసారి ఇండియన్ బాక్సాఫీసు ని షేక్ చెయ్యడానికి వచ్చేస్తున్నారు. కెజిఎఫ్ 2 వస్తున్నా మరోపక్క అదే డేట్ కి తమిళ స్టార్ హీరో విజయ్ బీస్ట్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి అయితే ట్రిపుల్ ఆర్ కి పోటీ లేకుండా అన్ని భాషల్లో మ్యానేజ్ చేయగలిగారు. కానీ ప్రశాంత్ నీల్ అలా చేయలేకపోతున్నారు. ప్రశాంత్ నీల్ స్టామినా కెజిఎఫ్ తో ప్రూవ్ అయినా విజయ్ బీస్ట్ తో పోటీ పడడానికి సై సై అంటున్నారు. ఇప్పటికే బెస్ట్ నుండి విడుదలైన రెండు సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంత పెద్ద మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. మరొపక్క కెజిఎఫ్ నుండి తుఫాన్ సాంగ్ కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
మరి విజయ్ బీస్ట్ ఏప్రిల్ 14 నుండి వెనక్కి తగ్గుతుంది అని అందరూ భావిస్తుంటే విజయ్ మాత్రం తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి సెన్సార్ కూడా కంప్లీట్ చేయించేసారు. ఏప్రిల్ 14 కాకపోతే ఒకరోజు ముందే బీస్ట్ రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది విజయ్ వ్యవహారం. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కి పోటీగా ఏప్రిల్ 14న ఏ భాషలోనూ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. ఒక్క తమిళంలో బీస్ట్ తప్ప. ఎట్టిపరిస్థితుల్లోనూ బీస్ట్ వాయిదావేయవద్దని మేకర్స్ కి విజయ్ చెప్పడంతోనే సన్ పిక్చర్స్ వారు ధైర్యంగా ఏప్రిల్ 14 కి ఆడియన్స్ ముందుకి బీస్ట్ ని తీసుకురాబోతున్నారట.