మా ఎలక్షన్స్ పూర్తయ్యి ఆరు నెలలు గడిచిపోయాయి. మా ఎలక్షన్స్ అప్పుడు మంచు ఫ్యామిలీ vs మెగా ఫ్యామిలీ అన్నట్టుగా విష్ణు vs నాగబాబు గొడవలు జరిగాయి. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ నాగబాబు మంచు విష్ణు తో తలపడ్డాడు. ఇటు నరేష్ మంచు విష్ణు గెలుపుకి కారణమయ్యాడు. అయితే మోహన్ బాబు, మంచు విష్ణు తర్వాత మెగా ఫ్యామిలీపై చాలా కామెంట్స్ చేసినా.. నాగబాబు కౌంటర్లు ఇస్తున్నారు. కానీ మిగతా మెగా ఫ్యామిలీ ఎవరూ మోహన్ బాబు కామెంట్స్ పై స్పందించలేదు. తాజాగా మంచు మనోజ్ మరోసారి మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు పై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. మా ఎన్నికల్లో ఓ వ్యక్తి తన అన్నని అనరాని మాటలన్నాడని, ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలిలో ఉన్న ఆ వ్యక్తి కి హయ్యర్ పర్పస్ లేకపోవడం వలనే మన ఫ్యామిలీని, మన ప్యానల్ వారిని అతను అన్ని తిట్లు తిట్టాడని మా నాన్నగారు చెప్పారంటూ నాగబాబు పై మనోజ్ ఇండైరెక్ట సెటైర్స్ వేసాడు.
హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకి ఏం చెయ్యాలో తెలియదు అని, ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతుంటారని, ఆ ఫ్యామిలిలో అందరూ హయ్యర్ పర్పస్ కలిగిన వారే అని, వారు సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలని తపనపడే వారని, ఈయన ఒక్కరే హయ్యర్ పర్పస్ లేని వ్యక్తి అంటూ మనోజ్ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. దానితో నాగబాబు లైన్ లోకొచ్చారు. ఫేస్ బుక్ ద్వారా ఇది మొదలు పెడతా అంటూ అస్క్ మీ అంటూ క్వశ్చన్ అవర్ పెట్టారు. దానితో ఓ నెటిజెన్ చాలారోజుల తర్వాత మీరు అస్క్ మీ పెట్టడానికి కారణం అనగానే నాగబాబు.. హయ్యర్ పర్పస్ కోసమంటూ కామెంట్ చెయ్యడం చూస్తే మనోజ్ పై డైరెక్ట్ గానే సెటైర్ వేశారని అర్ధమవుతుంది. మరి ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.