Advertisement
Google Ads BL

KGF2 సాంగ్: ప్రభాస్ ఫాన్స్ నిశ్చింత


నిన్నటివరకు ప్రభాస్ ఫాన్స్ రాధే శ్యామ్ డిజాస్టర్ మూడ్ లో బాగా డల్ అయ్యారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న రాధే శ్యామ్ కి కనీసం సో సో టాక్ కూడా రాకుండా డిజాస్టర్ టాక్ రావడం పట్ల ప్రభాస్ ఫాన్స్ చాలా బ్యాడ్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఆ సినిమాలోని స్టోరీ లైన్ చాలామందికి నచ్చినా అందులో ప్రభాస్ యాక్టింగ్ బాలేదు అంటూ విమర్శించేసరికి వారు మరింతగా కుంగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు ప్రభాస్ పై కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకంటే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మూవీ కంపల్సరీ పెద్ద హిట్ అవడం ఖాయమని, ప్రభాస్ పై ఇప్పటివరకు వచ్చిన విమర్శలు సలార్ తో కొట్టుకుపోవడం, తుడిచిపెట్టుకుపోతాయంటున్నారు.

Advertisement
CJ Advs

ఎందుకంటే ప్రశాంత్ నీల్ లేటెస్ట్ మూవీ కెజిఎఫ్ 2 నుండి తూఫాన్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ లో హీరో యశ్ ఎలివేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఆ లొకేషన్స్ చూసిన ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు నిశ్చింతగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఆరడుగుల కటౌట్ కలిగిన ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో అంటూ ఊహించేసుకుంటున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 తుఫాన్ సాంగ్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. లిరిక్స్ కానివ్వండి, యశ్ సీన్స్ కానివ్వండి, యశ్ ఎలివేషన్ అన్ని ప్రభాస్ ఫాన్స్ కే కాదు.. మ్యూజిక్ లవర్స్ చాలామందికి నచ్చింది. అంత ఎమోషన్స్ తో అంత యాటిట్యూడ్ తో ఆ సాంగ్ ఉంది. కెజిఎఫ్ 2 సాంగ్ చూసిన ప్రభాస్ ఫాన్స్ ఇక ఫికర్ లేదు.. మన ప్రభాస్ కి సలార్ మాస్ హిట్ పడడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. 

KGF2 toofan song creates a sensaiton:

Prabhas fans getting cool watching KGF2 song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs