గత కొన్ని రోజులుగా అంటే ట్రిపుల్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పటినుండి.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అలియా భట్ పై ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. అలియా భట్ కూడా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాకి ఇంకా వెయిట్ పెరుగుతుంది అని వారు చాలా ఫీల్ అవుతున్నారు. అలియా కూడా ట్రిపుల్ ప్రమోషన్స్ నాకెందుకు అన్నట్టుగానే బిహేవ్ చేసింది. దుబాయ్ ఈవెంట్ లోను, చిక్ బళ్లాపూర్ లో జరిగిన బిగ్గెస్ట్ ఈవెంట్ కి అలియా భట్ రాలేదు.. దానితో ఇక అలియా భట్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో కనిపించదేమో అనుకున్నారు.
కానీ అలియా భట్ ఢిల్లీ లో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్లో పాల్గొనడమే కాదు, ఆ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అమీర్ ఖాన్ తో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, అలియా లు దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో ఫాన్స్ కూల్ అయ్యారు. అరే అలియా ఆగయా.. సారి అలియా నిన్ను తప్పుగా అనుకున్నాం అంటూ అలియా ని క్షమించమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు ఫాన్స్. ఈ రోజు ఢిల్లీలో ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ కి బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ గెస్ట్ గా పాల్గొన్నారు. అయినప్పటికీ అక్కడ అలియా భట్ ని చూసిన ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ట్రిపుల్ ఆర్ మధ్యన అలియా ఉంటే ఆ అందమే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.