Advertisement
Google Ads BL

లీకుల పై మహేష్ సీరియస్


ఒక సినిమాని ని ఎంతో శ్రమించి నిర్మించి వాటిని రిలీజ్ చేసేందుకు పడే కష్టం కన్నా సినిమాల సెట్స్ నుండి పిక్స్ గాని, వీడియోస్ కానీ, ఆయా సాంగ్స్ కానీ లీక్ కాకుండా చూసుకోవడం కష్టమైపోతుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ రిలీజ్ చేస్తామని అన్న తర్వాత ఆ సాంగ్ అనుకున్న టైం కన్నా ముందే నెట్టింట్లో హల్ చల్ చేసింది. దానితో టీం కంగారు పడి ఆ సాంగ్ ని ముందే రిలీజ్ చెయ్యాల్సి వచ్చింది. పని చేస్తాడని అప్పజెబితే ఇట్లా లీక్ చేసాడు.. ఓ వ్యక్తి, ఆ సాంగ్ కోసం ఎంతో శ్రమించాం అంటూ థమన్ ఎమోషనల్ కూడా అయ్యాడు. తాజాగా సర్కారు వారి పాట నుండి పెన్నీ సాంగ్ ని లీక్ చేసేసారు. ఈ రోజు సాయంత్రం పెన్నీ సాంగ్ రిలీజ్ ఉంటే.. ఉదయమే పెన్నీ సాంగ్ ఓ యాప్ లో రిలీజ్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే ఆ లీక్ ఎలా అయ్యిందో మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. పెన్నీ సాంగ్ రిలీజ్ సాయంత్రం అని టైం చెప్పి ఆ ఆడియో ట్రాక్ ని కొన్ని యాప్స్ ద్వారా ఈవెనింగ్ టైం కి రిలీజ్ చెయ్యాలని చెప్పగా.. ఓ యాప్ యాజమాన్యం అనుకోకుండా సర్కారు వారి పాట సాంగ్ ని ముందే రిలీజ్ చెయ్యగా.. వెంటనే చూసి ఆ యాప్ నుండి ఆ సాంగ్ రాకుండా ఆపగలిగామని వివరణ ఇవ్వగా.. ఈ లీకులపై మహేష్ మేకర్స్ పై సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండాలని.. ఇలాంటి లీకులు ప్రమోషన్స్ పై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది అని.. ఇలాంటివి ఇకపై జరగకుండా చూసుకోమని మహేష్ మేకర్స్ కి గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తుంది.  

Mahesh is serious about leaks:

Penny Song leaked online before official release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs