క్రీజ్ లో ఉన్న హీరోయిన్ ఏం చేసినా సెన్సేషనే అవుతుంది. అదే కెరీర్ పోయినప్పుడు వాళ్లెలా ఉన్నారో అనేది కూడా హైలెట్ అవుతుంది. కెరీర్ పోయింది.. ఇప్పుడు వాళ్లెలా ఉన్నారో.. ఏమి చేస్తున్నారో, ఎలా జీవిస్తున్నారో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే సీనియర్స్ లిస్ట్ లోకి చేరినా చేతినిండా అవకాశాలతో, అందాల ఆరబోతతో.. ఇంకా ఇంకా హైలెట్ అవుతున్న తమన్నా మాల్దీవుల బీచ్ లో ఐస్ క్రీమ్ బండిపై కూర్చున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిల్కి బ్యూటీ తమన్నా ప్రస్తుతం మాల్దీవుల లలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ గ్లామరస్ గా ఐస్ క్రీం బండిపై ఎక్కి ఐస్ క్రీం అమ్ముతుంది.
ఓ యాడ్ షూట్ పర్పస్ కోసం మాల్దీవుల్లో స్టే చేసిన తమన్నా ఖాళీ సమయంలో ఇలా గ్లామర్ టచ్ ఇస్తూ బీచ్ లో ఐస్ క్రీం బండి మీద కూర్చుని ఆ బండి తొక్కుతున్న పిక్ అది. ఇక తమన్నా గత ఏడాది సీటిమార్ మూవీలో గ్లామర్ గాను, మ్యాస్ట్రో లో నెగెటివ్ టచ్ ఉన్న కేరెక్టర్స్ లో కనిపించింది. ఈ ఏడాది తమన్నా చిరు తో భోళా శంకర్ లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ బబ్లీ డాన్సర్ లోను కనిపించబోతుంది. ఈమధ్యన సోషల్ మీడియాలోనూ తమన్నా మిల్కి అందాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.