ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. రాధే శ్యామ్ విడుదలైన ప్రతి భాషలోనూ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ ఫలితం కలెక్షన్స్ అమాంతం పడిపోయాయి. వారం తిరిగేసరికి రాధే శ్యామ్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. రాధే శ్యామ్ ప్లాప్ అయ్యాక ప్రభాస్ మీడియా కి కనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, దర్శకుడు రాధాకృష్ణ రాధే శ్యామ్ సక్సెస్ టూర్ అంటూ ఏదో హడావిడి తప్ప. తాజాగా రాధే శ్యామ్ టాక్ పట్ల డైరెక్టర్ రాధా కృష్ణ రియాక్ట్ అయ్యారు. రాధే శ్యామ్ రిలీజ్ అయ్యాక ఆ సినిమాకి వస్తున్న ప్రశంశలు, విమర్శలు ఒకేలా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక కొంతమంది నుండి రాధే శ్యామ్ పై అంత నెగిటివిటి ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు అన్నారు.
కానీ ఇప్పుడు చాలామంది సినిమాలో ఎమోషన్స్ బావున్నాయి. సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అంటూ మెసేజెస్ చేస్తున్నారు. నా వైఫ్ అయితే సినిమా చాలా బావుంది. చాలా సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి కన్నీళ్లు పెట్టించేవిగా వున్నాయి అన్నది. ఆ కాంప్లిమెంట్ మర్చిపోలేను.
ఇక రాధే శ్యామ్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ తో మాట్లాడలేదు, ఆయన్ని కలవలేదు. జస్ట్ మెసేజ్ చేసుకుంటున్నాం. ప్రభాస్ ని కలవడానికి ఆయన వెకేషన్స్ కి వెళ్లిపోయారు. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి మూడు రోజులు ప్రభాస్ నా ఇమేజ్ సినిమాని డామినేట్ చేస్తుంది అంటూ నాతో చాలాసార్లు చెప్పినట్టుగానే ప్రభాస్ ఇమేజ్ రాధే శ్యామ్ ని డామినేట్ చేసింది అంటూ రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.