Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ కి షాక్


మరో ఆరు రోజుల్లో రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్న ట్రిపుల్ ఆర్ టీం ప్రస్తుతం ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ కి తరలి వెళుతుంది. నిన్న సాయంత్రం దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరైన ఎన్టీఆర్ - చరణ్ - రాజమౌళి టీం ఈరోజు చిక్కబళ్లాపూర్ కి చేరుకుంది. ఈ రోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు. ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేసేసారు. అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు చరణ్ ఫాన్స్ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. అందుకే 25 వరకు ఆగలేకపోతున్నారు. దానితో 24 నైట్ నుండే పెయిడ్ ప్రీమియర్స్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు వారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ సహా మొత్తం 12 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ట్రిపుల్ ఆర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేవో.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

Advertisement
CJ Advs

ఇక తెలంగాణ, ఆంధ్రాలోనూ ఐదు ఆటలకి అనుమతులు వచ్చేసాయి. అయితే బెన్ఫిట్ షోస్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్ ఆర్ పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోతున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఓవర్సీస్‌లో అయితే విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ట్రిపుల్ ఆర్ టీం వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే 24వ తేదీన ఎలాంటి షోలూ ప్రదర్శితం కాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లకు కూడా చెప్పారని టాక్. దానితో ఎన్టీఆర్ - చరణ్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు

Big shock to the fans of Ram Charan and Jr NTR:

RRR movie team has cancelled the Paid Premieres
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs