Advertisement
Google Ads BL

పెళ్లి పీటలెక్కనున్న సెలెబ్రిటీ జంట


ఏ ఇండస్ట్రీ లోనైనా సెలెబ్రిటీ పెళ్లిళ్లు కొత్తేమి కాదు. బాలీవుడ్ లో దీపికా - రన్వీర్ సింగ్, కత్రినా - విక్కీ కౌశల్, కరీనా-సైఫ్ ఇలా చాలామంది సెలెబ్రిటీ జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉన్న జంటలు ఉన్నాయి. టాలీవుడ్ లోను అలాంటి జంటలు చాలా ఉన్నాయి. తమిళం అయినా, మలయాళం అయినా.. ఏ లాంగ్వేజ్ అయినా ఒకే సినిమాలో కలిసి నటించిన జంటలు ప్రేమించుకుని మరీ పెళ్లి తో ఒక్కటవుతున్నారు. ఇప్పుడు తమిళనాట ఓ సెలెబ్రిటీ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. హీరోగా సత్తా చాటుతూనే విలన్ కేరెక్టర్స్ తోనూ, సపోర్టింగ్ కేరెక్టర్స్ తో అదరగొడుతున్న ఆదిపినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఆది పినిశెట్టి తమిళ్ తో పాటుగా తెలుగులో రంగస్థలం, మలుపు డబ్బింగ్ చిత్రం, అలాగే సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో నెగెటివ్ కేరెక్టర్స్ తో పాపులర్ అయ్యాడు. నిక్కీ గల్రాని కూడా తమిళంలో మంచి హీరోయిన్.. ఆమెకి తెలుగులో పెద్దగా సక్సెస్ లు లేవు కానీ.. తమిళనాట చాలా చిత్రాల్లో నటించింది. ఆది పినిశెట్టి - నిక్కీ గల్రాని కలిసి నటించిన మరకతమని, మలుపు చిత్రాలు షూటింగ్ టైం నుండి ఈప్రేమలో ఉన్నారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న ఈ జంట మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారని, త్వరలోనే నిశ్చితార్ధం కూడా జరగబోతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారంలోకొచ్చాయి. 

Aadhi Pinisetty wedding with Nikki Galrani?:

Nikki Galrani to marry this famous actor?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs