కాంట్రవర్సీ దర్శకుడు ఆర్జీవీ మొన్నామధ్యన భీమ్లా నాయక్ రిలీజ్ టైం లో ట్విట్టర్ లో తెగ హడావిడి చేసారు. అలాగే టికెట్ రేట్స్ ఇష్యుపై కూడా ఏపీ ప్రభుత్వానికి ట్వీట్స్ తో చుక్కలు చూపించారు. తాజాగా రాధే శ్యామ్ మూవీ చూసిన ఆర్జీవీ ఆ సినిమాపై తనదైన లో కౌంటర్ ఇచ్చారు. దానితో పాటుగా భారీ బడ్జెట్ సినిమాలకు ఓ కౌంటర్ ఇచ్చేసారు ఆయన. ఏ హీరోకైనా ప్రస్తుతం విడుదలైన సినిమా సాధించిన కలెక్షన్స్ పరంగానే అతని నెక్స్ట్ సినిమాకి మార్కెట్ ఉంటుంది.. అలాగే అంచనాలు కూడా ఉంటాయి. అదే రాధే శ్యామ్ మూవీ తీసుకోండి. ఆ సినిమాకి బడ్జెట్ లో పెట్టిన ఐదో వంతు బడ్జెట్ రాధే శ్యామ్ కి పెడితే సరిపోతుంది.
ప్రభాస్ రెమ్యునరేషన్ తీసేసి.. కొద్దిగా బడ్జెట్ పెడితే సరిపోయేది. ప్రేక్షకులకి విజువల్ ఫీస్ట్ అవసరం లేదు. కథలోని ఎమోషన్స్ విజువల్ ఫీస్ట్ కప్పట్టేస్తుంది. అదే కాశ్మీరీ ఫైల్స్ సినిమా అసలు రిలీజ్ అయ్యేవరకు ఎవరికీ తెలియదు.. ఆ సినిమా కేవలం నాలుగు నుండి ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పుడు 100 కోట్లు వసూలు చేసింది. అదే రాధే శ్యామ్ సినిమా కి పెట్టిన బడ్జెట్ కి వచ్చిన కలెక్షన్స్ నికి పొంతన లేదు.. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథలో దమ్ము ఉంటే ఆ సినిమా ఆడుతుంది అని ఈ రెండు సినిమాలు నిరూపించాయన్నారు.